యువ సర్పంచ్‌లు బాగా పనిచేయాలి
జగిత్యాల,జనవరి30(జనంసాక్షి): గ్రామాలను ప్రగతి పథంలో నిలపడంలో సర్పంచుల పాత్ర కీలకమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో యువకులకు మంచి అవకాశం వచ్చిందనీ, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఈ సారీ ఎన్నికల్లో యువకులు పెద్ద మొ త్తంలో సర్పంచులుగా ఎన్నికయ్యారనీ, యు వత రాజకీయాల్లోకి రావడం శుభ సూచకమన్నారు. సిఎం కెసిఆర్ పథకాలను ఆచరణలో పెటట్డంలో వారే కీలకమని అన్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని అన్నారు. అలాగే పథకాలను గ్రామస్థాయిలో అమలు చేసే బాధ్యతను సక్రమంగా నిర్వహించాలని అన్నారు. నిరంతరం ప్రజలకు అం దుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.