యూఏఈ టార్గెట్ 342 పరుగులు

ప్రపంచకప్‌లో భాగంగా పూల్-బీలో నేడు దక్షిణాఫ్రికా-యూఏఈ జట్లు తలపడుతున్నాయి. వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో యూఏఈ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 341 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ లలో డివిలియర్స్ అత్యధికంగా 99 పరుగులు చేయగా ఆమ్లా-12, డీకాక్-26, రూసో-43, మిల్లర్-49, డుమినీ-23 పరుగులు చేసి ఔటయ్యారు. కాగా బెహర్దీన్-64, ఫిలాండర్-10 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. యూఈఏ బౌలర్లలో మహ్మద్ నవీద్ అత్యధికంగా 3 వికెట్లను పడగొట్టగా, కామ్రాన్ షాజద్, అంజద్ జావేద్, మహ్మద్ తాకీర్ తలో వికెట్ తీశారు. 342 పరుగుల టార్గెట్ తో యూఏఈ బరిలోకి దిగింది.