యూనిమోని ఫైనాన్స్ సర్వీస్ లిమిటెడ్ ప్రారంభించిన సీఈఓ కృష్ణన్

మెట్పల్లి టౌన్ ,అక్టోబర్ 13,
జనంసాక్షి
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో యూనిమోని ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీని సీఈవో కృష్ణన్ చేతుల మీదుగా పున: ప్రారంభించడం జరిగింది. కంపెనీ యొక్క సేవలు విదేశీ కరెన్సీ, టికెట్ ,బుకింగ్,బంగారం పై ఋణాలు వంటి లావాదేవీలు జరుపబడును వీటిని మెట్పల్లి డివిజన్లో ని పరిసర పరిసర గ్రామ ప్రజలు మరియు పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వినియోగదారులు, యూనిమోని ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీకి చెందిన ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.