యూనియన్ బ్యాంక్ ఎటిఎం కార్డులున్నవారికి ఉచిత ప్రమాదభీమా…
కరీంనగర్,జూలై 14(జనంసాక్షి): యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో ఎటిఎం కార్డులున్న వారికి ఉచిత ప్రమాద భీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు హైద్రాబాద్ ప్రాంతీయ ఎజిఎం ఎస్‌ఎన్ విశ్వేశ్వర తెలిపారు. శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో నగునూర్ గ్రామానికి చెందిన యువరైతు శ్రీనివాస్ ట్రాక్టర్ ప్రమాదంలో మరణించగా, ఆయన భార్య రమకు బ్యాంకు తరపున రెండు లక్షల రూపాయల చెక్కును ఆయన అందచేశారు. కార్యక్రమంలో బ్యాంకు ఎజిఎంలు నేద్కర్, ఎ రవీంద్రకుమార్, చీఫ్ మేనేజర్లు రవీంద్రనాథ్, దీక్షతులు, శ్రీనివాస, సీనియర్ మేనేజర్లు శ్యాంప్రసాద్, కోటేశ్వర్ రావు, ఎన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.