యూనివర్సిటీల్లోనూ తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం

– తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం
హైదరాబాద్‌:
ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ యూనివర్సిటీని తెలంగాణ యూనివర్సిటీగా మార్చాలని తెలం గాణ రాజకీయ ఐకాస అధ్యక్షుడు కోదండరాం డిమాండ్‌చేశారు. అవసరమైతే రాయలసీమ, ఆం ధ్రప్రాంతాల్లో వేర్వేరుగా వ్యవసాయ విశ్వవిద్యా లయాలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సూచించారు. సోమాజీగూడాలో ప్రెస్‌క్లబ్‌లో వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉద్యోగుల ఐకాస ఏర్పాటు చేసిన మీడియాసమావేశంలో కోదండ రాం పాల్గోన్నారు. ఈ యూనివర్సిగీల్లో డీసీ ని యామకం నుంచి ఉద్యోగుల నియామాకా లన్నిం టిలో తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరు గుతుందన్నారు. ఈ దఫావీసీగా తెలంగాణ ప్రాం త వ్యక్తినే నియమించాలని డిమాండ్‌ చేశారు.