యూపీఏలో రాజ్యాంగేతర శక్తుల పాలన

4

న్యూఢిల్లీ,మే27(జనంసాక్షి): యూపీఏ హయాంలో రాజ్యాంగేతర శక్తుల చేతుల్లో పాలన జరిగిందని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. ఎన్డీయే పాలనలో ప్రధాని కార్యాలయం చుట్టూ అధికారం కేంద్రీకృతమైందన్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. రాజ్యాంగంలో ప్రధాని, పీఎంఓకు స్పష్టమైన అధికారాలను పేర్కొన్నారని ప్రధాని తెలిపారు. రాహుల్‌ సూటు బూటు సర్కారు వ్యాఖ్యలపై స్పందించిన మోదీ యూపీఏ హయాంలో రాజ్యాంగేతర శక్తుల చేతుల్లో పాలన జరిగిందని విమర్శించారు. ఏడాది క్రితం నాటితో పోలిస్తే పాలనలో ఎంతటి మార్పు వచ్చిందని అన్నారు.   ఒక పద్ధతి ప్రకారం దేశ అభివృద్ధికి సోపానాలు వేస్తున్న తీరు వెల్లడయిందన్నారు. . తాము సాధించిన విజయాలను మోదీ ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రజల అంచనాలు అధికంగా ఉన్నాయని, తాము చేయాల్సింది ఇంకా చాలా ఉందని మోదీ అన్నారు. ప్రధాన సేవకుడిగా ఏడాది క్రితం ప్రజలు అప్పచెప్పిన బాధ్యతలను పూర్తి నిజాయతీతో నిర్వర్తించడానికి అంకితం అవుతున్నానని అన్నారు.  భారత్‌పై విశ్వాసం క్రమంగా సన్నగిల్లుతున్న సమయంలో మేము బాధ్యతలు స్వీకరించాం. నిరాఘాటంగా సాగిపోతున్న అవినీతి, నిర్ణయాలు తీసుకోలేని అసందిగ్ధత.. అప్పట్లో ప్రభుత్వాన్ని స్తంభింపచేశాయి. పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, ఆర్థిక అభద్రత పరి/-థసితుల్లో ప్రజలను నిస్సహాయులుగా వదిలేశారు. అత్యవసర, నిర్ణయాత్మక చర్యలు అవసరమయ్యాయని  మోదీ గుర్తు చేశారు.

బంగ్లా పర్యటనకు ప్రధాని

ప్రధాని నరేంద్రమోదీ జూన్‌ నెల 6,7 తేదీల్లో రెండు రోజుల పాటు బంగ్లాదేశ్‌లో పర్యటించనున్నారు. ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాల బలోపేతం దిశగా ఆయన పర్యటన సాగనుంది. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య తీస్తా నదీ జలాల పరిషారం అవుతుందని కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. అయితే ఆ అంశంపై తమను సంప్రదించకుండా ¬ంమంత్రి ప్రకటన చేయడాన్ని తృణమూల్‌ కాంగ్రెస్‌ తప్పుపట్టింది. బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా ఆహ్వానం మేరకు మోదీ అక్కడకు వెళ్లనున్నారు. ఇందుకు సంబంధించి బంగ్లాదేశ్‌ విదేశాంగశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. షేక్‌ హసీనాతోపాటు అ దేశ అధ్యక్షుడుతో మోదీ సమావేశం కానున్నారు.