యూపీలో కాంగ్రెస్‌ పునర్నిర్మాణం

2

– ఆపిల్‌ ఆదర్శం

– రాహుల్‌

లక్నో,సెప్టెంబర్‌21(జనంసాక్షి):

ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీని కార్యకర్తలే పునర్నిర్మించాలని యాపిల్‌ సంస్థను స్టీవ్‌ జాబ్స్‌ మలచినంతగా కార్యకర్తలు పార్టీ కోసం అంకిత భావంతో పనిచేయాలని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. సోమవారం  ఆయన ఉత్తర ప్రదేశ్‌లోని మధుర దేవాలయాన్ని సందర్శించిన అనంతరం పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. సవిూప భవిష్యత్తులో యూపీ అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. పార్టీ సిద్దాంతాలే తమను నెంబర్‌ 1 స్థానంలో నిలబెడతాయన్నారు. నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడంతో మోదీ ప్రభుత్వం విఫలమయ్యిందని విమర్శించారు. అదే సమయంలో రైతు వ్యతిరేక ‘భూసేకరణ సవరణ బిల్లు’ను అడ్డుకోవడంలో కాంగ్రెస్‌ విజయం సాధించిందని రాహుల్‌ చెప్పారు.  కాంగ్రెస్‌ కార్యకర్తలను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఆయన తాను నాయకుడను కానని అన్నారు. విూకు నాయకుడనని చెప్పుకోవడం లేదని, విూ కుటుంబంలో ఒకడినని చెప్పుకుంటున్నానని రాహుల్‌ అన్నారు.ఉత్తరప్రదేశ్‌ లోని మదుర కాంగ్రెస్‌ కార్యకర్తలతో ఆయన ముచ్చటించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ఇటీవలి కాలంలో రాహుల్‌ గాందీ రెండు,మూడు రోజులకు ఒకసారి కొత్త డైలాగులు చెప్పి ప్రజలను ,కాంగ్రెస్‌ శ్రేణులను అకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.కాగా ప్రదాని మోడీ గురించి మాట్లాడుతూ విమర్శకులు చేసే నష్టం కన్నా, ఆయన తనకు తానే ఎక్కువ నష్టం చేసుకుంటున్నారని రాహుల్‌ వ్యాఖ్యానించారు.