యూపీలో ఘోరం
` దళిత బాలికపై సామూహిక అత్యాచారం, హత్య..
` అరెస్టు చేయడానికి వెళ్లిన పోలీసులపైనా కాల్పులు
లఖ్‌నవూ,ఫిబ్రవరి 6(జనంసాక్షి): ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోండా జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ దళిత బాలికపై ఇద్దరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆపై హత్య చేశారు. అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులపైనా వారు కాల్పులకు తెగబడ్డారు. ఈ సంఘటనలో పోలీసులు ఓ నిందితుడిని అరెస్టు చేయగా మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు.నవాబ్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధి గ్రామంలోని పంటపొలాల్లో శనివారం ఉదయం ఓ బాలిక మృతదేహాన్ని స్థానికులు కనుగొన్నారు. శరీరంపై గాట్లు, తీవ్ర గాయాలను గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా కలెక్టర్? మార్కండేయా షాహి, ఎస్పీ సంతోష్ మిశ్రా పోలీసు బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. శుక్రవారం రాత్రి బహిర్భూమి కోసం బాలిక బయటకు రాగా నిందితులు ఆమెను ఎత్తుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ఎస్పీ వెల్లడిరచారు. నిందితులను పట్టించిన వారికి రూ.25వేల బహుమతి ఇస్తామని కూడా ప్రకటించారు. కాగా ఈ ప్రకటన అనంతరం 5 గంటలల్లోనే దుండగుల గురించి పోలీసులకు సమాచారం అందింది.గ్రామం సవిూపంలోని ఓ చెరుకు తోటలో వారు తలదాచుకున్నట్లు తెలుసుకుని ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఈ క్రమంలో తప్పించుకునేందుకు నిందితులు పోలీసులపై కాల్పులు జరిపారు. ఖాకీలు ఎదురు కాల్పులు జరపగా ఓ దుండగుడి కాలిలోకి తూటాలు దూసుకెళ్లాయి. తీవ్రంగా గాయపడిన నిందితుడు మహేశ్? యాదవ్?ను అదుపులోకి తీసుకున్నారు. పరారైన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ సంతోశ్ మిశ్రా తెలిపారు. త్వరలోనే అతడిని కూడా అదుపులోకి తీసుకుంటామని వెల్లడిరచారు.