యూపీ అసెంబ్లీలో గందరగోళం
లక్నో: యూపీ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం నెలకొంది. శాంతి భద్రతలు కాపాడటంలో అఖిలేశ్ ప్రభుత్వం విఫలమైందని బీఎస్పీ నేతలు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. యూపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ వైఖరికి నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు.