యూరియాకోసం తోపులాట: లాఠీఛార్జీ
తాండూరు:రంగారెడ్డి జిల్లాలో యూరియాకోసం రైతుల మధ్య జరిగిన తోపులాట లాఠీఛార్జీకి దారితీసింది. తాండూరులో ఈరోజు యూరియాకోసం రైతులు తెల్లవారుజామునుంచే బారులు తీరారు. యూరియా తక్కువగా ఉన్నట్లు ప్రచారం కావటంతో ఓ రైతుకు గాయాలయ్యాయి. ఆదిలాబాద్లో కూడా రైతులు ఎరువులకోసం రాస్తారోకో చేశారు. వ్యాపారులు, అధికారులు కుమ్మకై ఎరువులు అమ్ముకుంటున్నారని ఆరోపించారు.