యూరోపియన్ దేశాల్లో మళ్లీ విజృంభణ
వారంలో 11శాతం కేసులు పెరిగినట్లు అంచనా
అప్రమత్తంగా ఉండకుంటే మరింత ముప్పు తప్పదు
హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్
జెనీవా,నవంబర్26(జనం సాక్షి ): యూరోపియన్ దేశాల్లో రోజురోజుకీ కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తుంది. రోజువారీ కొత్త కేసుల నమోదు, మృతుల సంఖ్య భారీగా ఉండడంతో.. ప్రపంచ ఆరోగ్య సంస్థ అక్కడ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. చైనా లో పుట్టిన ఈ మహమ్మారి కరోనా రెండేళ్ల కావస్తున్నా ఇంకా అదుపులోకి రాలేదు. కొన్ని దేశాల్లో తగ్గుముఖం పడుతున్నా యూరోప్ దేశాల్లో మాత్రం రోజుకో సరికొత్త రూపం సంతరించుకుంటూ.. విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో యూరోప్‌లో గత వారంలో 11 శాతం కేసులు పెరిగినట్లు ప్రకటించింది. అంతేకాదు.. వచ్చే వసంత కాలం నాటికి కరోనా వైరస్ మహమ్మారి ఐరోపాలో 7,00,000 వరకూ కోవిడ్ మరణాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. అక్టోబర్ మధ్య కాలం నుంచి ఈ పెరుగుదల కొనసాగుతోందని చెప్పారు. తక్షణ చర్యలు తీసుకోవాలని.. యూరోప్ లోని దేశాలన్నిటిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగం పెంచాలని సూచించారు. అంతేకాదు ప్రజలు ప్రభుత్వం తప్పనిసరిగా కరోనా నియంత్రణ కోసం నిబంధనలు పాటించాలని .. మాస్కులు అందరూ పెట్టుకోవాలని.. భౌతిక దూరం పాటించాలని చెప్పారు. ఇప్పటికే యూరోపియన్ దేశాల్లో అనేక ప్రాంతంలో 1బిలియన్ కు పైగా టీకా డోసులు పంపిణీ చేసినట్టు వెల్లడిరచారు. అయితే కరోనా మహమ్మారి ముగిసి పోయిందని, వ్యాక్సిన్ తీసుకున్నవారికి కరోనా వైరస్ సోకదని భావిస్తున్న వారంతా అప్రమత్తంగా ఉండాల్సిందేనని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ అన్నారు. తాజాగా మళ్లీ ఐరోపా అంతటా కోవిడ్ `19 కేసుల పెరుగుతున్నా యని పేర్కొన్నారు. టీకాతో సంబంధం లేకుండా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ప్రజలను కోరారు. వ్యాక్సిన్‌లు ప్రాణాలను కాపాడతాయి. తీవ్రమైన వ్యాధి, మరణాల ప్రమాదాన్ని మాత్రమే తగ్గిస్తాయని టెడ్రోస్ పేర్కొన్నారు. టీకాలు వేసినప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం కొనసాగించాలని చెప్పారు. మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, గుంపులుగా ఉండకపోవడం, అవసరమైతే తప్ప బయటకు రావొద్దని, ఇళ్ల లోపల బాగా వెంటిలేషన్ ఉంచుకోవాలని టెడ్రోస్ చెప్పారు. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కోవిడ్`19 మహమ్మారిని రాదనే తప్పుడు భావననుంచి బయటపడాలన్నారు. ప్రజలు ఈ రకమైన భావనతోనే తాము ఆందోళన చెందుతున్నామని అన్నారు. టీకాలు ప్రాణాలను కాపాడతాయే కానీ అవి కరోనాను పూర్తిగా అడ్డుకోవని టెడ్రోస్ అధనామ్ ట్వీట్ చేశారు. దక్షిణాఫ్రికా, బోట్స్వానాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న కోవిడ్ `19 వేరియంట్ గురించి చర్చించడానికి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేస్తోంది. అంతకుముందు, బోట్స్వానాలో 32 వేరియంట్లు ఉన్న కరోనా వైరస్ జాతి కనిపించడంపై శాస్త్రవేత్తలు హెచ్చరించారని విూడియా నివేదికలు తెలిపాయి. అన్ని ఇతర వేరియంట్‌ల కంటే స్టెయ్రిన్ స్పైక్ ప్రోటీన్‌లో ఎక్కువ మార్పులను కలిగి ఉందని రష్యన్ వార్తా సంస్థ నివేదించింది. దక్షిణాఫ్రికా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ కూడా దక్షిణాఫ్రికాలో కొత్త జాతి కనుగొన్నట్లు ధృవీకరించింది. విదేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో భారత్ అప్రమత్తమైంది. యూరోప్, ఆఫ్రికా దేశాల నుండి వచ్చే ఫ్లైయ్యర్లను కఠినమైన స్క్రీనింగ్, టెస్టింగ్ చేయాలని నిర్ణయించింది. దీనిక సంబంధించిన రాష్టాల్రు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు.