యూరో తుది పోరు నేడే
కీప్:యూరోపియన్ ఛాంపియన్‌షిప్ 2012 తుది ఘటానికి చేరుకుంది.తుది పొరు ఆదివారమే.ఓవైపు టోర్ని ఆరంభం నుంచి తిరుగులేని విజయాలతో ఫరల్‌కు దూసుకొచ్చిన స్పెయిన్ మరోవైపు ఆరంభంలో తడబడి ఆపై కీలక మ్యాచ్‌ల్లో తిరుగులేని విజయాలతో తుది పోరుకు సాదించిన ఇటలీ అంతిమ సమరానికి సిద్దమయ్యాయి.డిఫెండింగ్ ఛాంపియన్ ప్రపంచకప్ విజేత స్పెయిన్‌ను ఎక్కువమంది ఫెవరెట్‌గా పరిగణీస్తున్నప్పటీకీ ఇటలీనీ ఏమాత్రం తక్కువగా అంచనా వేయలేం నాకౌట్లో ఆ జట్టు సాధించిన విజయాలే అందుకు నిదర్శనం పైగా స్పెయిన్‌పై ఇటలీకి మెరుగైనా రికార్డుంది.స్పెయిన్‌తో 30 మ్యాచ్‌లాడిన ఇటలీ 10మ్యాచ్ ల్లో నెగ్గి 8 మ్యాచ్‌ల్లో ఓడింది 12 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.ప్రధాన టోర్నీల్లో స్పెయిన్‌ను ఐదుసార్లు ఓడింది.గ్రూప్ దశలో రెండు జట్ల మద్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది.బలాబలాల ప్రకారం ఇరు జట్లూ సమవుజ్జీలుగా కనిపిస్లున్నాయి.