యెడ్డి కంటతడి పెట్టారు

కర్ణాటక మాజీ సీఎం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప సీబీఐ కోర్టులో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మైనింగ్ స్కాం విచారణ సందర్భంగా జడ్జి అడిగి ప్రశ్నలు అడుగుతుండగా ఆయన కంటితడి పెట్టారు. మైనింగ్‌ స్కాం కు సంబంధించి జరిగిన విచారణకు యడ్యూరప్ప హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రశ్నల వర్షం కురిపించారు. రెండున్నర గంటల్లో దాదాపు 475 ప్రశ్నలు అడిగారు. మైనింగ్ స్కాం విషయంలో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని జడ్జి అడిగినప్పుడు యడ్యూరప్ప కంటతడి పెట్టారు. నేను ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. చట్టపరిధిలోనే విధులు నిర్వహించానని చెప్పారు. యడ్యూరప్ప సీఎంగా ఉన్న సమయంలో మైనింగ్‌ లాబీ నుంచి ఆయన కుటుంబం నిర్వహిస్తున్న ట్రస్ట్ కు 20 కోట్ల రూపాయల నిధులు అందాయని ఆరోపణలొచ్చాయి.