యెమెన్‌లో 53 మంది దుర్మరణం

యెమెన్‌లో రెబల్స్ దళాలకు, ప్రభుత్వ రక్షణ దళాలకు మధ్య జరిగిన దాడుల్లో 53 మంది మృతి చెందారు. దక్షిణ ప్రాంతంలోని సముద్ర తీర నగరమైన ఎడెన్ లో ఈ ఘర్షణలు చోటు చేసుకున్నాయని అక్కడి ఆర్మీ అధికారులు తెలిపారు. గత రెండు రోజులుగా రెబల్స్‌కు, అధ్యక్షుడు మన్సూర్ హాదీకి చెందిన ప్రభుత్వ రక్షణ దళాలకు మధ్య జరుగుతున్న దాడుల్లో 17 మంది సాధారణ ప్రజలు చనిపోయారు. 26 మంది రెబల్స్ హతమయ్యారు. ఎడెన్ నగరం చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో జరిగిన ఈ దాడుల్లో అనేకమంది సాధారణ ప్రజలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఎడెన్ నగరంలోని పోర్టు ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలని రెబల్స్ దళాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. గతకొన్ని నెలలుగా యెమెన్ లో అంత్యరుద్ధం నెలకొనటంతో, షిల్తే హుతి రెబల్స్ దళాలు రాజధాని సనాను ఆక్రమించుకున్నారు. దీంతో అధ్యక్షుడు మన్సూర్ హాదీ ఎడెన్ నగరంలోనే ఫిబ్రవరి నెలవరకూ తలదాచుకున్నాడు. ఇక్కడ్నుంచి అధ్యక్షడు హది వెళ్లిపోయి, సౌదీ అరేబియాలో ఆశ్రయం పొందారు.