యోగా తో మానసికంగా శారీరకంగా ఫిట్ గా ఉంటుంది.

అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఈ రోజు తొర్రూర్ లో బిజెపి ఆధ్వర్యంలో యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. బీజేపీ తొర్రూరు శాఖ అధ్యక్షుడు పల్లె కుమార్ ఆధ్వర్యంలోస్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ లో యోగ అభ్యాస కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి కార్యకర్తలు యోగాసనాలు, సూర్య నమస్కారాలు, వ్యాయామం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకులు నియోజకవర్గ ఇన్చార్జి పెదగాని సోమయ్య మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్యసమితి లోని 191ధేశాలను ఒప్పించి జూన్ 21న ప్రపంచ వ్యాప్తంగా యోగ దినోత్సవం జరుపుతున్నారు అని తెలిపారు.భారతీయ వారసత్వ సంపద యోగా అని,యోగ ను విశ్వ వ్యాప్తం చేసిన ఘనత నరేంద్ర మోడీ గారి కే దక్కుతుంది అని తెలిపారు.యోగా తో మానసికంగా శారీరకంగా ఫిట్ నెస్ ఉంటుంది అని తెలిపారు.యోగా తో ఏకాగ్రత, క్రమశిక్షణ అలవడుతుంది అని,యోగా దినోత్సవం ఆరోగ్యం, సంతోషానికి,శాంతికి సూచిక అని తెలిపారు.యోగా అనేది ఏ ఒక్కరిది కాదని,ఇది అందరిదీ అని,ప్రతీ ఒక్కరూ యోగ సాధన చేస్తే తమ అనారోగ్యం రుగ్మతలు తొలగుతాయి అని తెలిపారు.కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన తగ్గని ధీ ర్ఘ కాళిక జబ్బులు కూడా యోగా తో నయం అవుతాయి అని తెలిపారు.ఉరుకులు పరుగుల జీవితంలో  మానసిక ప్రశాంతత కోసం యోగా మంచి దివ్యౌషధంగా పనిచేస్తుంది అని తెలిపారు.ప్రతీ ఒక్కరూ నిత్య జీవితంలో యోగా ను భాగస్వామ్యం చేసుకోవాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి పాలకుర్తి నియోజకవర్గ నాయకులు జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ర శ్రీనివాస్ రెడ్డి (కేఎస్ ఆర్),15వ వార్డు కౌన్సిలర్ కొలుపుల శంకర్, జిల్లా కార్యదర్శి రచ్చ కుమార్, ఎస్సీ మోర్చ మహా బాద్ పార్లమెంట్ ఇంఛార్జి అలిసేరి రవిబాబు, జిల్లా నాయకులు అన్నం మధుసూదన్ రెడ్డి,గుడిమళ్ళ వెంకటేశ్వర్లు, అర్బన్ నాయకులు మంగళపళ్ళి యాకయ్య, పైండ్ల రాజేష్, రాయపురం రాజకుమార్, కాగు నవీన్, జలగం రవి, వినయ్ కుమార్ శర్మ,నర్కుటి ఛలపతి రాజ్,గంధం రాజు,నూకల నవీన్,తూర్పాటి వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.