యోగా ద్వారా యావత్ ప్రపంచం భారత్ వైపు చూస్తుంది.
ఎనిమిదవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రం మెదక్ రోడ్డులోని బాలుర ఉన్నత పాఠశాలలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దూది శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పతంజలి యోగ సమితి యోగా శిక్షకులు పెద్ది మనోహర్,సింగోజు మురళీ కృష్ణ ఆచార్యులు పాల్గొని యోగ సాధకులకు,విద్యార్థిని విద్యార్థులకు యోగా, ప్రాణాయామం యొక్క ప్రత్యేకతను వివరిస్తూ యోగాసనాలు వేయించారు.ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు దూది శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ యోగా ద్వారా యావత్ ప్రపంచం భారత్ వైపు చూస్తుందని ప్రపంచ దేశాలు యోగ సాధన చేస్తూ శారీరక మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకుంటున్నారని, ఈ సందర్భంలో యోగాకు మరింత ప్రాచుర్యం కల్పించుటకొరకు నరేంద్ర మోడీ విశేషంగా కృషి చేసి ప్రపంచ దేశాలను కలిపి ప్రత్యేకంగా జూన్ 21 రోజును అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటింప చేసారని, ఈ యోగా డే ను జరుపుకోవడం భారతీయ సమాజానికి గర్వకారణమని ప్రతి ఒక్కరు యోగా సాధన చేస్తూ శారీరక మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో గంగాడి మోహన్ రెడ్డి, విద్యాసాగర్, పత్రి శ్రీనివాస్, నర్సింహారెడ్డి, శ్రీనివాసరెడ్డి, కోడూరి నరేష్, తోడుపునురి వెంకటేశం, రాజు, రామకృష్ణ, చెంది సత్యనారాయణ, అరుణా రెడ్డి, పెంబర్ల యాదగిరి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.