యోగా పవర్ : నాలుగేళ్ల చిన్నారి గ్రేట్ ఫీట్

టమోటాలను కొంచె గట్టిగా పట్టుకుంటేనే చితికి పోతాయి. అలాంటిది వాటిపై కూర్చుంటే ఉంటాయా. ఇక కోడి గుడ్లు వాటిని పట్టుకునేప్పుడే జాగ్రత్త అంటారు. ఎందుకంటే అవి చేతిలోనే పగిలిపోయేంతగా ఉంటాయి. అలాంటి వాటిపై ఏకంగా కూర్చుంటే చితికిపోకుండా..పగిలిపోకుండా ఉంటాయా. అది సాధ్యమేనా. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది ఓ నాలుగేళ్ల చిన్నారి. వాటిపై ఏకంగా పద్మాసనం వేసి కూర్చుంది. చెన్నైలోని అన్నానగర్ లోని జెర్సీ మోజెన్ మెట్రిక్యులేషన్ హైస్కూల్ విద్యార్థిని హర్నికాశ్రీ సుందరమూర్తి చెన్నై ప్రెస్ క్లబ్ లో అరుదైన ఈ విన్యాసం చేసి చూపించింది. టమోటాలపై ఉంచిన కోడిగుడ్ల ట్రేపై పద్మాసనం వేసింది. 20 నిమిషాల పాటు అలా కూర్చుంది. అయితే టమోటాలు చితికిపోవడం..కోడిగుడ్లు పగిలిపోవడం లాంటివి ఏమి జరగలేదు. ఏఎస్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ, చెన్నై ఆర్కిడ్ లయన్స్ క్లబ్లు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించేందుకు ఈ విన్యాసాన్ని హర్నికాశ్రీ ప్రదర్శించినట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.