రంగలీల మైదానంలో రావణ వధ

 

– హాజరైన మంత్రి దయాకర్ రావు, ఎమ్మెల్యే  నరేందర్, మేయర్ సుధారాణి, కలెక్టర్, సిపి తదితరులు

 

– ఆకట్టుకున్న బాణాసంచా, సాంస్కృతిక కార్యక్రమాలు

 

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ (జనం సాక్షి)

 

భారతదేశంలోని మైసూరు తర్వాత అత్యంత వైభవంగా నిర్వహించే దసరా వేడుకలు తెలంగాణలోని వరంగల్ నగరం ఉర్సు రంగల లీల మైదానంలో బుధవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ గోపి, పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ,ఎంపీ దయాకర్, ఎమ్మెల్సీ బండ ప్రకాష్ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ దేశంలోనే మైసూర్ తర్వాత గొప్పగా ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తున్నారని అన్నారు. అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఎంతోమంది ఉత్సవాలు తిలకించేందుకు వచ్చారని వారందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే ఏడాది మరింత గొప్పగా ఉత్సవాల నిర్వహిస్తామని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్ రావు ఎమ్మెల్యే  నరేందర్ తదితరులు రావణాసురుని విగ్రహానికి రిమోట్ సహాయంతో నిప్పు పెట్టారు. ఈ ఉత్సవాల్లో లేజర్ షో, బాణాసంచా, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఎంతో ఆకర్షించాయి. వర్షం కారణంగా ఉత్సవాలు కొంత ఆలస్యంగా జరిగిన చివరికి వర్షంలో సైతం ప్రజలు వచ్చి రావణ వద ను తిలకించారు. పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.  వివిధ శాఖల అధికారులు ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సమన్వయంతో పనిచేశారు. ఈ కార్యక్రమంలో దసరా ఉత్సవ కమిటీ బాధ్యులు నాగపురి సంజయ్ బాబు, మేడిది మధుసూదన్, వడ్నాల నరేందర్, వంగరి కోటేశ్వర్, ఓగిలిశెట్టి అనిల్ కుమార్, గోనె రాంప్రసాద్, మంచనగిరి సమ్మయ్య, రంజిత్, చిరంజీవి, సంజీవ్, అఖిల్, మధు, రాజు  క్రాంతి, రాజశేఖర్, చిరంజీవి, గోవర్ధన్, ప్రవీణ్, అశోక్, వినయ్, నాగరాజు స్థానిక కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.