రంగశాయిపేటలో  వైభవంగా రావణ వధ ఉత్సవం

–  రావణ ప్రతిమకు నిప్పంటించిన మేయర్ సుధారాణి

 

– ప్రత్యేక అతిథిగా విచ్చేసిన జగిత్యాల సీనియర్ సివిల్ జడ్జి కంచ ప్రసాద్

 

వరంగల్ ఈస్ట్,  అక్టోబర్ (జనం సాక్షి)

 

చెడుపై మంచి సాధించిన విజయాన్న్నే విజయదశమి పండుగగా జరుపుకుంటున్నామని ఈ విజయదశమి రోజు నుండి అన్ని విజయాలు చేకూరాలని గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణిఅన్నారు .బుధవారం  విజయదశమి పండుగ సందర్భంగా రంగశాయిపేట లోని దసరా ఉత్సవ సమితి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గుండు పూర్ణచందర్, దామెరకొండ కరుణాకర్  ఆధ్వర్యంలో నిర్వహించిన రావణ వధ కార్యక్రమానికి గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి ముఖ్యఅతిథిగా విచ్చేసి 36 ఫీట్ల ఎత్తైన రావణ ప్రతిమకు నిప్పంటించినారు.  అంతకుముందు వర్షం కారణంగా రావణవధ కార్యక్రమానికి కొంత అంతరాయం జరిగినప్పటికినీ, వర్షం తగ్గుముఖం పట్టడంతో 8 గంటల నుండి ప్రజలంతా రావణువధ జరిగే మహంకాళి దేవాలయ మైదానానికి చేరుకోవడం జరిగినది. వర్షానికి రావణ ప్రతిమ మరియు ప్రతిమకు ఏర్పాటు చేసిన బాంబులు తడిసినప్పటికినీ ఉత్సవ సమితి నిర్వాహకులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి రావణ ప్రతిమ దహనమయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ రావణ వధ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిర్వహించాలని ఏర్పాట్లు చేయగా వర్షం కారణంగా కొంత అంతరాయం జరిగినప్పటికినీ వరుణుడు కరుణించడం వల్ల ఆ భద్రకాళి, ఈ మహంకాళి అమ్మవార్ల ఆశీస్సుల వల్ల ఈ కార్యక్రమం విజయవంతం అయ్యిందని అన్నారు. 38 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ప్రారంభించిన రావణవధ కార్యక్రమాన్ని నేటి వరకు కూడా ప్రజలందరి సహాయ సహకారాలతో దసరా ఉత్సవ సమితి నాయకులు నిర్వహిస్తున్నందుకు ఉత్సవ సమితి కమిటీ సభ్యులందరికీ అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ రావణవధ కార్యక్రమానికి గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ నుండి పూర్తిస్థాయి లైటింగ్ సౌకర్యంతో పాటు ఇతర సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయించామని తెలిపారు. ఈ రంగశాయిపేట ప్రాంత అభివృద్ధికి ఒక నగర మేయర్ గా నా వంతు సహకారాన్ని అందించి రంగశాయిపేట అభివృద్ధిలో భాగస్వామురాలి నవుతానని మేయర్ అన్నారు. గతంలో రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతంలో తన  ఎంపీ నిధులను కేటాయించి అధిక ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రత్యేక అతిథిగా విచ్చేసిన జగిత్యాల జిల్లా సీనియర్ సివిల్ జడ్జి కంచ ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ రావణవధ కార్యక్రమానికి నన్ను ఆహ్వానిస్తున్నప్పటికినీ, సమయభావం ఉద్యోగరీత్యా వేరే ప్రాంతాలలో ఉండటం వలన రాలేకపోయానని ఈ సంవత్సరం తప్పకుండా రావాలని ఉత్సవ సమితి ప్రతినిధులు కోరినందున రావడం జరిగిందని ఈ రకంగా నైనా ప్రజలందరినీ కలుసుకునే అవకాశం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. దసరా ఉత్సవ సమితి అధ్యక్షులు  పూర్ణచందర్ మాట్లాడుతూ ప్రజలందరి సహకారం వల్లనే ఈ రావణ వధ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ముందు ముందు కూడా మీ అందరి సహకారంతో ఇంకా ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు

ప్రధాన కార్యదర్శి దామెరకొండ కరుణాకర్ మాట్లాడుతూ మేము నిర్వహించిన కార్యక్రమానికి కార్పొరేషన్ పరంగా ఏర్పాట్లకు చేయించిన నగర మేయర్ గుండు సుధారాణి గారికి, కార్పొరేటర్ గుండు చందన ప్రత్యేక ధన్యవాదాలు తెలియ జేస్తున్నామని అన్నారు. ఈ రావణ వధ కార్యక్రమంలో గౌరవ అతిథిగా ఎమ్మెల్సీ బండా ప్రకాష్, ప్రత్యేక అతిథిగా జగిత్యాల జిల్లా సీనియర్ సివిల్ జడ్జి కంచ ప్రసాద్, ఆత్మీయ అతిథులుగా 42వ డివిజన్ కార్పొరేటర్ గుండు చందన పూర్ణచందర్, 40 వడివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి,43వ డివిజన్ కార్పొరేటర్ ఈదురు అరుణ విక్టర్ విచ్చేసినారు.

కార్యక్రమంలో కోశాధికారి కొక్కొండ భాస్కర్, ముఖ్య సలహాదారులు ముత్తినేని రామమూర్తి, బి.వి.రామకృష్ణ ప్రసాద్, డాక్టర్ పోతు దర్శనం, మడుపోజు రామ్మూర్తి, ఉత్సవ సమితి ప్రతినిధులు పరికిపండ్ల రాజేశ్వరరావు, కోట శ్రీధర్ కుమార్, వలుపదాసు రాజశేఖర్, డాక్టర్ రేణికుంట్ల ప్రవీణ్ కుమార్, పాకాల మనోహర్, బక్కి వంశీ, కన్నెబోయిన కుమార్, కంచ రమేష్, గుండు నవీన్ కుమార్, ఆడెపు రఘు, కత్తెరపల్లి వేణు, పస్తం బిక్షపతి, బజ్జూరి వీరేశం, వంగరి శ్రీనివాస్, ఎలుగు అశోక్, దేవునూరి వెంకటేశ్వర్లు, అల్లం వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.