రంగసాయిపేటలో బొడ్రాయిల ప్రతిష్టాపనకు మార్గం సుగమం

– ఆర్ వై ఎఫ్ ఆధ్వర్యంలో కాంక్ష ఫంక్షన్ హాల్ లో విలేకరుల సమావేశం
వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 17(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని రంగసాయిపేటలో బొడ్రాయిల ప్రతిష్టాపన కోసం చేస్తున్న ప్రయత్నాలు సుగమం అయ్యాయి ఈ మేరకు సోమవారం స్థానిక కాంక్ష ఫంక్షణాల్లో  రంగసాయిపేట యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా  స్థానిక నాయకుడు ఉద్యమకారుడు కొల్లూరు యోగానంద్ మాట్లాడుతూ ఆర్ వై ఎఫ్ ఆధ్వర్యంలో బొడ్రాయి ఏర్పాటుకు తన వంతు పూర్తి సహకారం ఉంటుందన్నారు. అదేవిధంగా  బొడ్రాయి ఏర్పాటుకు లో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు. గతంలో బొడ్రాయి ప్రతిష్టాపన విషయంలో ఉన్న కోర్టు స్టేలు ఉపసంహరించుకునేందుకు ఇద్దరు మైనారిటీలతోపాటు తాను సంతకాలు చేశామని చెప్పారు. మతసామరస్యంతో కేసును ఉపసంహరించుకునేందుకు ఇద్దరు మైనార్టీ వర్గాలకు చెందిన వారిని అభినందించారు. గ్రామంలో ప్రజల అభీష్ట మేరకు నూతనంగా నెహ్రు సెంటర్లో అదేవిధంగా రామాలయం వద్ద బొడ్రాయిల ప్రతిష్టాపన జరుగుతుందన్నారు. దీనికంటే ముందు  స్థానిక మహంకాళి దేవాలయం వద్ద రాజకీయాలకతీతంగా అలాయి భళాయి కార్యక్రమాన్ని నిర్వహించుకోనున్నట్లు చెప్పారు. స్థానిక నాయకులు గుండు పూర్ణచందర్ మాట్లాడుతూ ప్రజలందరూ చూస్తున్న బొడ్రాయి  మహోత్సవ ప్రతిష్టాపనకు కోర్టులో ఉన్న అడ్డంకులను తొలగించేందుకు అంగీకరించిన కొల్లూరు యోగానంద్, ఎం క్యూ ఏ బేగ్,  మీర్జా మెహబూబ్ ను అభినందించారు. కార్యక్రమంలో మండల పరశురాములు, షేర్ల అనిల్ కుమార్, బైరి రామేశ్వర్, చందా మనోహర్, కుమ్మరి కృష్ణమూర్తి, పాలకుర్తి శ్రీను, ఆవునూరి కుమారస్వామి, రవి, కొట్టే వినయ్ కుమార్, రావుల నరేష్, శంకేసి కిషోర్, రావుల సురేష్, మహేష్, రాగి శ్రీకాంత్, దువ్వ రాజ్ కుమార్, మండల రమేష్, కత్తెరపల్లి వేణు, దున్నాల విజయ్, దామెర కొండ కరుణాకర్, శంకేసి లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Attachments area