రంగసాయిపేటలో వృద్ధులకు ఘన సన్మానం
వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 01(జనం సాక్షి)
లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ వారియర్స్ వారి ఆధ్వర్యంలో శనివారం ప్రపంచ వృద్దుల దినోత్సవం సందర్భంగా రంగశాయిపెట్ లోని తెలంగాణ రిటైర్డ్ ఉద్యగుల సంగంకు చెందిన కుమ్మరి మల్లేశం మరియు రుద్రోజు వీరనారయణ గార్లకు శాలువాలతో ఘనంగా లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ వారియర్స్ ప్రెసిడెంట్ మండల పరశురాములు, సెక్రెటరీ నవీన్ రెడ్డి, ట్రెజరర్ యన్. ప్రవీణ్ మరియు డిస్ట్రిక్ట్ సెక్రెటరీ చైల్డ్ హుడ్ క్యాన్సర్ డా: ఆకారపు రాజగోపాల్ ఈ కార్యక్రమం లో పాల్గొని ఘనంగా సన్మానించారు, ఈ సందర్భంగా మండల పరశురాములు మాట్లాడుచు మన సమాజం లో ప్రతి ఒక్కరు వృద్ధులను గౌరవించి వారి జీవిత అనుభవాలను నేటి తరం పిల్లలు వాటిని ఆకళింపు చేసుకొని ముందుకు సాగాలని తెలిపారు, కుటుంబ వ్యవస్థ ప్రపంచం లోనే చాలా గొప్ప విలువలు కలిగినది అని అన్నారు, ఇంకా ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు..
Attachments area