రంగసాయిపేటలో స్నేహ పూర్వక షటిల్ టోర్నమెంట్
వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 09(జనం సాక్షి)
రంగశాయిపేట వాగ్భట యోగా సంఘం మన ముచ్చట్లు గ్రూప్, లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ వారియర్స్ సంయుక్తంగా రంగశాయిపేట ప్రభుత్వ పాఠశాల క్రీడా మైదానంలో ఆదివారం స్నేహపూర్వక షటిల్ టోర్నమెంట్ను నిర్వహించారు. ఈ ఈ టోర్నమెంటులో విజేతలుగా నిలిచిన వారికి కీ.శే॥డాక్టర్ ఆడెపు చంద్రమౌళి జ్ఞాపకార్థం వారి కుమారుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడైన ఆడెపు రవీందర్ నగదు బహుమతిని అందజేశారు. పోటీల్లొ పాల్గొన్న క్రీడాకారులకు కోడిగ్రుడ్లు,అల్పాహారాన్ని గుర్రపు రాంచందర్, సాంపెల్లి గంగాధర్ లు అందజేశారు.
పోటాపోటీగా సాగిన ఈ టోర్నమెంటులో విజేతలుగా వాగ్భట యోగా సంఘం అధ్యక్షులు దొమ్మాటి సుభాష్, యోగా మాస్టర్ యాసారపు రాకేశ్ టీం ప్రథమ బహుమతి సాధించగా, పోశాల కన్నయ్య, చీదురు కుమారస్వామి టీం ద్వితీయ బహుమతి సాధించారు. టోర్నమెంటులో విజయం సాధించిన విజేతలకు వాగ్భట యోగా సంఘం ఆధ్వర్యంలో షీల్డ్ లు, టోర్నమెంటులో పాల్గొన్న క్రీడాకారులకు మనముచ్చట్లు ఆధ్వర్యంలో ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో వాగ్భట సంఘం సభ్యులు పెసర నిరంజన్ రెడ్డి, పెరుమాండ్ల మధు, కందికొండ మోహన్, కొండ్రెడ్ది నవీన్ రెడ్డి, ఎలుమకంటి రాంబాబు, మహ్మద్ రహమతుల్లా ఖాన్’ రాంబాబు, చిన్నా, కర్ణాకర్, సాంబయ్య, క్రీడాకారులు ప్రతాప్ రెడ్డి, వెంకట్, విష్ణు, తదితరులు పాల్గొన్నారు.