రంగసాయిపేట దసరా ఉత్సవ సమితి కరపత్రాలు ఆవిష్కరణ
వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 03(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని అండర్ రైల్వే గేట్ రంగసాయిపేట దసరా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సోమవారం ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఉత్సవ సమితి అధ్యక్షులు గుండు పూర్ణచందర్ అధ్యక్షతన ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1984 నుంచి ఇప్పటివరకు 38 సంవత్సరాలుగా దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈసారి మరింత ఉత్సాహంగా ఉత్సవాల నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి దామరకొండ కర్ణాకర్, ఉత్సవ సమితి బాధ్యులు ముత్తినేని రామ్మూర్తి, కొక్కొండ భాస్కర్, ఏలుగు అశోక్ బివి రామకృష్ణ ప్రసాద్, పోతు దర్శనం, కంచ రమేష్, పస్తం బిక్షపతి, పాకాల మనోహర్, పరికిపండ్ల రాజేశ్వర్, వలపదాసు రాజశేఖర్ గుండు నవీన్ కుమార్, అల్లం వీరస్వామి, ఆడెపు రఘు, దేవునూరి వెంకటేశ్వర్లు వంశీ, కన్నబోయిన కుమార్ తదితరులు పాల్గొన్నారు