రంజాన్‌నాటికి రిజర్వేషన్లు అన్నావు
– ముస్లిం రిజర్వేషన్లపై మాట తప్పిన కేసీఆర్
– తెలంగాణ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్
హైదారబాద్,జులై3(జనంసాక్షి):
ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ అంశాన్ని ప క్కదారి పట్టించేందుకే కేసీఆర్ ప్రయత్ని స్తున్నా రని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపిం చారు. వారికి ఇచ్చిన హావిూలు రంజాన్ దగ్గర పడుతున్నా ఎందుకు అమలు చేయలేదన్నారు. మభ్యపెట్టే మాటలతో ప్రజలను కెసిఆర్ మోస పుచ్చుతున్నారని అన్నారు. గాంధీభవన్‌లో శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ రంజాన్ నాటికి రిజర్వేషన్లు ఇస్తామన్న హావిూ ఏమైందని ప్రశ్నించారు. ఉద్యోగాల నోటిఫికేషన్ల కంటే ముందే రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంతవరకు వక్ఫ్ బోర్డుకు అధికారాలు ఇవ్వలే దని మండిపడ్డారు. అన్యాక్రాంతమైన వక్ఫ్ భూ ములను స్వాధీనం చేసుకోవాలని ఆయన డి మాండ్ చేశారు. షాదీముబారక్ పథకం నినా దంగానే మారిందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శిం చారు. ముస్లింలు రిజర్వేషన్లు అడిగితే కేసీఆర్ ఇప్తార్ విందు ఇస్తున్నారని మండలిలో కాంగ్రెస్ పక్షనేత షబ్బీర్ అలీ విమర్శించారు.. జిహెచ్‌ఎం సి ఎన్నికల్లో ముస్లిం ఓట్లను ఆకర్షించేందుకే ఇఫ్తార్ విందులు ఇస్తామంటున్నారని ఆరోపిం చారు. ముస్లిం మైనారిటీలకు ఎన్నికల్లో ఇచ్చిన హావిూలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముస్లింలకు ఇస్తామన్న 12శాతం రిజ ర్వషన్ల హావిూ ఎక్కడికెళ్లిందని ప్రశ్నించారు. వారికి ఇచ్చిన హావిూలు అమలు చేయాలని కోరుతూ హైదరాబాద్ లో 10న ఇఫ్తార్ విందు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రంజాన్‌కల్లా అంటూ వారిని హావిూతో మోసపుచ్చుతున్నారని అన్నారు. ఇదిలావుంటే గోదావరి పుష్కరాల పనుల్లో నాణ్యతాలోపం స్పష్టంగా కనబడుతోందని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి చెప్పారు. దీనికి బాధ్యులైన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. భద్రాచలంలో పుష్కరఘాట్‌ల వద్ద మురుగునీరు కలుస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణలో గోదావరి పుష్కరాలకు సోనియాను ఆహ్వానించామని పొంగులేటి వెల్లడించారు.