రక్తం కొరత ను తీర్చండి.. సింగరేణి జిఎం కు వినతి…

శుక్రవారం శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి జి.యం సంజీవరెడ్డి కి తలసేమియా సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు, మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని నిరుపేదలకు, గర్భిణీ స్త్రీలకు కిడ్నీ డయాలసిస్ బాధితులకు అత్యవసర శాస్త్ర చికిత్స వారికి రక్తము దొరకక మంచిర్యాల రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు లో రక్తము కొరత తీవ్రంగా ఉన్నదని జిల్లా కలెక్టర్ శ్రీరాంపూర్ ఏరియా జిఎం కు లేఖ ద్వారా ఆదేశాలు జారీ చేయడం జరిగినది.
ఈ లేఖను మంచిర్యాల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కంకణాల భాస్కర్ రెడ్డి ద్వారా శ్రీరాంపూర్ జిఎం కి వినతి పత్రము ఇవ్వడం జరిగినది.

ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ కంకణాల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో 800 మంది తల సేమియా సికిల్ సేల్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు వీరికి జీవితాంతము ప్రతి 15 రోజులకు ఒకసారి రక్తము ఎక్కించాలి వీరికి ఉచితంగా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ద్వారా అందజేయడం జరుగుతుంది మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆస్పటల్ లోని రక్తం అవసరం ఉన్న ప్రతి పేషెంట్ కు కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుంది ఇప్పుడు రక్తం కొరత తీవ్రంగా ఉన్నదని జిఎం కి వివరిస్తూ వారం రోజులలో రక్తదాన శిబిరాలు నిర్వహించి ఈ వ్యాధిగ్రస్తులను ఆదుకోవాలని కోరడం జరిగినది.

దీనికి స్పందించిన జిఎం మాట్లాడుతూ గనుల వారీగా డిపార్ట్మెంట్ల వారిగా రక్తదాన శిబిరాలు నిర్వహించి వ్యాధిగ్రస్తులను ప్రభుత్వ ఆసుపత్రిలోని నిరుపేదలను గర్భిణీ స్త్రీలను ఆదుకుంటామని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో రక్తం కొరత లేకుండా చూస్తామని హామీ ఇవ్వడం జరిగింది వారం రోజుల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ రక్తదాన శిబిరాలు గతంలో మాదిరిగా రెగ్యులర్ గా నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల జిల్లా బ్రాంచ్ చైర్మన్ కంకణాల భాస్కర్ రెడ్డి, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు కాసర్ల శ్రీనివాస్ ,తలసేమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాసర్ల రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు