రక్తదానం చేసిన ఏటూరునాగారం నాయి బ్రాహ్మణ సేవ సంఘం సభ్యులు
ఏటూరు నాగారం (జనం సాక్షి) జూలై.22
ఈ రోజు ఏటూరునాగారం సామజిక హాస్పిటల్ లో డెలివరి పేషంట్ ల కోసం నాయి బ్రాహ్మణ సేవ సంఘం సభ్యులు స్వచ్చందంగా వచ్చి రక్తదానం చేయటం జరిగింది. ఈ సందర్బంగా నాయి బ్రాహ్మణ సేవ సంఘం ఏటూరునాగారం అధ్యక్షులు దడిగేల నరసింహులు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రామచందర్ గారు మరియు జిల్లా గౌరవ అధ్యక్షులు దడిగల సమ్మయ్య గారు మాట్లాడుతూ, రక్తదానం అంటే ప్రాణదానం చేయటం లాంటిదే అని, అందరూ అపోహలు విడి రక్తదానం చేయాలనీ అన్నారు. ఆపదలో ఎందరికో రక్తదానం చేస్తున్న ఏటూరునాగారం బ్లడ్ డోనర్స్ సేవలను కొనియాడరు. అనంతరం రక్తదాతలకు సర్టిఫికెట్ లు, పండ్లు పంపిణి చేశారు.ఈ కార్యక్రమం లో నాయి బ్రాహ్మణ సేవ సంఘం దడిగల లక్ష్మణ్, సత్యం, మహేందర్, రాజారామ్ శ్రీరాముల, చంద్రశేఖర్, రాజు, శ్రీనివాస్, రాము, రమేష్, మల్లికార్జున్, రవి, మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.