రక్తదాన శిబిరానికి ప్రాజెక్ట్ అధికారికి ఆహ్వానం.

మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఉట్నూరు పట్టణంలో రక్త దాన శిబిరం.

జనం సాక్షి ఉట్నూర్.

మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం జన్మదినం ఉట్నూర్ మండల కేంద్రంలో ఐబి చౌరస్తా వద్ద తేదీ 15-10- 22 శనివారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు రక్తదాన శిబిరం నిర్వహించడం జరగుతుందని ముస్లిం జేఏసీ చైర్మన్ అంజత్ మొయినుద్దీన్ తెలిపారు. వారు మాట్లాడుతూ రక్తదాన శిబిరానికి ముఖ్యఅతిథిగా ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి వరుణ్ రెడ్డి ని ఆహ్వానించడం జరిగిందని అదేవిధంగా ఆసక్తిగల రక్తదాతలు వచ్చి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రధాన కార్యదర్శి జవ్వాద్ ఆన్సారీ కో ఆప్షన్ సభ్యుడు రషీద్ యూత్ సభ్యులు ఆమెర్ సలవొద్దిన్ బబ్లు తదితరులు ఉన్నారు.