రక్షణ సిబ్బందిని అడ్డుకున్న ప్రజలు
బెల్లంపల్లి పట్టణం: పట్టణంలోని టేకుల బస్తీలో నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మగృహాలను సింగరేణి రక్షణ సిబ్బంది అడ్డుకోవడంపై స్థానికులు ఎదురు తిరిగారు.ఆ ప్రదేశంలో ఇందిరమ్మగృహాలు నిర్మించుకోవడానికి తహశీల్దారు తమకు అనుమతి ఇచ్చారని, దీనిని సింగరేణి అధికారులు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. దీంతో వారు సింగరేణి రక్షణ సిబ్బంది వెళ్తున్న వాహనాన్ని అడ్డుకుని వారితో వాగ్వాదానికి దిగారు.