రఘనందనరావు మీడియా సమావేశం

హైదరాబాద్‌. జనంసాక్షి: తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి సస్పెండ్‌ అయిన జిల్లా మాజీ అధ్యక్షుడు ఎం. రఘనంద్‌రావు ఈరోజు మధ్యాహ్నం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చసి వివరాలు వెల్లడించనున్నారు. ఆయన తన భవిష్యత్‌ కార్యచరణను ప్రకటించే అవకాశం ఉంది.
2001లో ఆవిర్భావ సమయంలో టీఆర్‌ఎస్‌లో చేరిన రఘనంద్‌రావు పార్టీలో వివిధ హూదాల్లో పనిచేశారు. కొంత కాలంగా పార్టీ నాయకత్వం తీరుపట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో రఘనందన్‌రావు నిన్న భేటీ జరిపారనే సమాచారంతోనే ఆయనను సస్పెండ్‌ చేస్తున్నట్లు పార్టీ అధినేత కేసీఆర్‌ మంగళవారం రాత్రి ప్రకటించారు.