రఘురాం నిర్ణయం అద్భుతం!

otrlg77h9 నెలల్లోనే రెపోరేటును 125 బేసిస్ పాయింట్ల మేర తగ్గించి ఆర్‌బీఐ మంచి పని చేసిందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. వృద్ధి, గిరాకీకి వూతమిచ్చేందుకు రేట్ల కోత ప్రయోజనాన్ని బ్యాంకులు ఖాతాదారులకు బదిలీ చేస్తాయని తాను అనుకుంటున్నట్లు చెప్పారు. ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని సాధించడం ఆధారంగా ఆర్‌బీఐ భవిష్యత్ నిర్ణయాలు ఉంటాయన్నారు. ఆర్‌బీఐ ఏ నిర్ణయం తీసుకున్నా మనం విశ్వసించాలని తెలిపారు. ప్రత్యక్ష పన్ను వసూళ్లు బడ్జెట్ అంచనాలను మించే అవకాశం ఉండటంతో ఆదాయ లక్ష్యం స్వల్పంగానే తగ్గొచ్చని తెలిపారు. పన్నుల సరళీకరణ వంటి సంస్కరణల అమలు ద్వారా దేశ జీడీపీ మరో 2% వృద్ధి చెందే అవకాశముందని జైట్లీ పేర్కొన్నారు.