రజాకారుల పాలనకు వ్యతిరేకంగా పోరాటం
రజాకారుల పాలనకు వ్యతిరేకంగా పోరాటం
చేసిన వీరవనిత ఐలమ్మ.
చాకలి ఐలమ్మ ఆశాల కోసం పనిచేయాలి.
కోటపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పరి మహేందర్.
తాండూరు సెప్టెంబర్ 26(జనంసాక్షి)చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని కోటపల్లి మండల కేంద్రంలో సోమవారం టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు మోసిన్, ప్రధాన కార్యదర్శి సుశీల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతి థులుగా కోటపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పరి మహేందర్, సీనియర్ నాయకులు పతంగి పాండు, పాల్గొన్నారు.ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ నాడు చేసిన పోరాట ప్రతిమ దొరల గడీల పాలనకు వ్యతిరేకంగా, రజాకారుల పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి పోవాలని పోరా టం చేసిన వీర వనిత అని అన్నారు. దున్నేవాడి దే భూమి అనే నినాదంతో పోరాటం కొన సాగించి ఎంతోమంది పేద ప్రజలకు భూమిని ఇప్పించిన ఘనత చాకలి ఐలమ్మది అని అన్నారు. నేటి సమాజం వారి జీవిత త్యాగాల ను గుర్తు చేసుకొని వారి ఆశాల కోసం పనిచే యాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీశైలం, ఉప్పరి యాదయ్య, శివకుమార్, యువజన సంఘం అధ్యక్షులు మంగలి నాగేష్, మైనార్టీ సంఘం అధ్యక్షులు ఇస్మాయిల్, అన్నా సాగర్ గ్రామ కమిటీ అధ్యక్షులు కృష్ణ, బుగ్గపురం నరసింహులు గౌడ్, రజక సంఘం ఉపాధ్యక్షులు గోపాల్, శ్రీనివాస్, కిష్టప్ప, జి. నర్సింలు, ఏ .నర్సింలు, నవీన్, ఉదయ్, పాండు, దసప్ప, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.