రజాకారుల మీద పోరాడేన ఘనత కమ్యూనిస్టులది
సిపిఐ నాయకులు యార్లగడ్డ
అశ్వరావుపేట ఆర్సి,
సెప్టెంబర్ 17
ప్రజా కార్ల మీద పోరాడి న ఘనత కమ్యూనిస్టు పార్టీల దేనని దమ్మపేట సిపిఐ పార్టీ నాయకులు యార్లగడ్డ భాస్కరరావు అన్నారు. అశ్వరావుపేట నియోజకవర్గం లోని దమ్మపేట లో
తెలంగాణ వీలినం సభను దమ్మపేట సిపిఐ కార్యాలయం వద్ద జాతీయ జెండాను. సిపిఐ జెండాను. ఆవిష్కరించి ఈ సందర్భంగా సిపిఐ నాయకులు యార్లగడ్డ భాస్కరరావు సిపిఐ మండల కన్వీనర్ ఎస్ కే దస్తగిరి మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో పోరాటం నిర్వహించడం జరిగిందని ఇందులో బిజెపి టిఆర్ఎస్ ఏ పార్టీకి సంబంధం లేదని ఆ రోజుల్లో కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో గేరెల్లా దళాలను ఏర్పాటు చేసి రజాకారుల మీద పోరాడి తెలంగాణ వీలినం చేసిన ఘనత కమ్యూనిస్టులు లేనని .దొరల దగ్గర భూస్వాముల దగ్గర ఉన్న ప్రభుత్వ భూములను.పదివేల ఎకరాలను పేదవాళ్ళకి పంచిన ఘనత కమ్యూనిస్టులు దేనని ఇందులో ఏ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని నాలుగు వేల ఎనిమిది వందల మందిని కమ్యూనిస్టు నాయకులను బల్లి దానాలతో తెలంగాణ.వీలినం జరిగిందని అన్నారు.. బిజెపి కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలఉనికిని కాపాడుకోవడానికి రకరకాల పేర్లతో ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్నారని వీళ్ళు ఎవరికీ కూడా తెలంగాణ అమరవీరులను స్మరించే హక్కు లేదని మీరు ఆ రోజుల్లో బుజ్జువా భూస్వాములకు దొరలకు కొమ్ము కాసినవారేననిఅన్నారు. తెలంగాణ అమరవీరులను పేరు కూడా తలిచే హక్కు వీరికి లేదని,ఎంతో హడావుడి గా.కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అంగు ఆర్భాటాలు చేసి తెలంగాణ ప్రజలను మరో మారు మోసం చేయాలని చూస్తున్నారని తెలిపారు .మలిదశ తెలంగాణ పోరాటంలో సిపిఐ పార్టీ అగ్ర భాగాన ఉన్నదని ప్రజలకి అన్ని తెలుసని రాబోయే కాలంలో కేంద్రంలో బిజెపికి రాష్ట్రంలో టిఆర్ఎస్ కి తగిన బుద్ధి చెప్తారని ఈరోజున కెసిఆర్ సిపిఐ పార్టీ లేనిదే. మనుగాడా .లేదనుకొని సిపిఐ పార్టీ సహాయ సహకారాలు కావాలని ప్రతి మీటింగులో సిపిఐ పార్టీ జపం చేస్తున్నాడని ఇదొక రాజకీయ ఎత్తుగడని కానీ సిపిఐ పార్టీ పేద ప్రజలకు అండగా ఉండి వారికోసం ప్రాణ త్యాగానికైనా జైలు జీవితానికైనా ఎనకాడదని అన్నారు. కెసిఆర్,సిపిఐ పార్టీ సహాయ సహకారాలు కావాలంటే. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలని బేషరతుగా అమలు చేయాలని ప్రతి పేద కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇవ్వాలని ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు పోడు భూములు పట్టాలు ఇవ్వాలని ఇల్లు లేని ప్రతి నిరుపేదకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు కల్పించాలని రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని వ్యవసాయ కార్మికులందరికీ కులీ బందు అమలు చేయాలనిడిమాండ్ చేశారు. కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్టీ ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను ఈ కేసీఆర్ కల్పిస్తే సిపిఐ పార్టీ కేసీఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉంటుందని లేనియెడల కేంద్రంలో బిజెపి పార్టీని రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడం ఖాయమని ఈ సందర్భంగా తెలిపినారు.దమ్మపేట మల్లారం కాలనీలో జెండా ఆవిష్కరణ విప్లవ నగర్ లో జెండా ఆవిష్కరణ సిపిఐ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ జరుపుకొని ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి సుంకు పాక ధర్మ ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి బత్తుల సాయి ఏఐటీయూసీ కార్యదర్శి బెజవాడ రాము దొంగ లక్ష్మీనారాయణ నల్ల ప్రసాద్ పద్దం విజయలక్ష్మి రాపోలు శివన్నారాయణ జానీ బేగం శాంతి గాజు పోయిన కృష్ణవేణి జాన్ బి నల్లబోతుల నాగార్జున నక్క నాగమణి తదితర గ్రామ శాఖ కార్యదర్శులు కార్యకర్తలు పాల్గొన్నారు