రణరంగంగా మారిన కాబూల్‌ ఎయిర్‌పోర్టు

సైన్యం కాల్పుల్లో ఐదుగురు పౌరుల మృతి
మృతుల సంఖ్య మరింతే పెరిగే ఛాన్స్‌
కాబూల్‌,అగస్టు16(జనంసాక్షి): ఆప్గనిస్తాన్‌ రాజధాని కాబూల్‌ లోని ఎయిర్‌ పోర్ట్‌ రణరంగంగా మారింది. విమానం ఎక్కేందుకు జనం పరుగులు పెట్టారు. దీంతో రద్దీని ఆపేందుకు సైన్యం కాల్పులు జరిపింది. తొక్కిసలాట, కాల్పలు కారణంగా కనీసం ఐదుగురు చనిపోయినట్లు తెలస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. వీసా అవసరం లేకుండానే కెనెడా తీసుకెళ్తున్నారన్న రూమర్స్‌ తో కాబూల్‌ ఎయిర్‌ పోర్టుకు వేలాది మంది పౌరులు వచ్చారు. మిలిటరీ విమానాల్లో ఎక్కేందుకు ప్రయత్నించారు. కాబూంల్‌ ఎయిర్‌ పోర్ట్‌ అమెరికా సైన్యం ఆధీనంలో ఉండగా… మిలిటరీని లెక్కచేయకుండా రన్‌ వేపైకి దూసుకొచ్చారు జనం. క్రౌడ్‌ ను కంట్రోల్‌ చేసేందుకు సైన్యం గాల్లోకి కాల్పులు జరిపింది. జనంపైనా కాల్పులు జరిపినట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఆఫ్ఘన్‌ ఎయిర్‌ స్పేస్‌ మూతపడిరది. ఎయిర్‌ పోర్ట్‌ నుంచి విమానాల రాకపోకలు ఆపేశారు. ఎయిర్‌ స్పేస్‌ మూసివేసిన కారణంగా నిలిచిన ఎయిరిండియా సర్వీసులు నిలిచిపోయాయి. అమెరికా నుంచి భారత్‌ వచ్చే విమానాలను దారిమళ్లిస్తున్నారు. షికాగో`న్యూఢల్లీి , శాన్‌ఫ్రాన్సిస్కో`న్యూఢల్లీి విమానాలను గల్ఫ్‌ దేశాల విూదుగా రీ`ఫ్యూయలింగ్‌ చేసి భారత్‌కు తరలిస్తున్నారు. అఫ్ఘానిస్తాన్‌ విూదుగా ప్రయాణించే అనేక విమానాల దారిమళ్లిస్తున్నారు. దీంతో అఫ్ఘాన్‌లో భారతీయులు సహా అనేక దేశాల ప్రజలు చిక్కుకున్నారు.