రద్దీ దృష్ట్యా బోగీలు పెంచాలిరద్దీ

హైదరాబాద్‌,డిసెంబర్‌20(జ‌నంసాక్షి): శబరిమల భక్తలతో పాటు , సంక్రాంతికి రద్దీకిఇ అనుగుణంగా ప్రత్యేక రైళ్లను నడపడంతో పాటు అదనపు బోగీలను వేయాలని పలవురు ప్రయాణికుల కోరుతున్నారు. ఇప్పటికే శబరికి వెళ్లే రళ్లన్నీ నిండిపోవడంతో రిజర్వేషన్‌ కోసం వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జ్యోతి దర్శనం కోసం వెళ్లేవారికి ఉన్న రైళ్లలో బోగీలు పెంచాలని, ప్రత్యేక రైళ్లు నడపాలని అన్నారు. ఇదిలావుంటే అన్ని రైళ్లలో ఆర్‌ఏసీ కోటాను పెంచాలని నిర్ణయించడం వల్ల కొంత మెరుగు కాగలదన్నారు.  ఆర్‌ఏసీ విభాగంలో ప్రయాణించేవారి సంఖ్యను పెంచుతూ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో స్లీపర్‌ కోచ్‌లో ఐదు సైడ్‌లోయర్‌ బెర్తుల్లో పది మందికి, మూడో తరగతి ఏసీ కోచ్‌లో రెండు సైడ్‌ లోయర్‌ బెర్తుల్లో నలుగురిని, రెండో తరగతి ఏసీ కోచ్‌లో లోయర్‌ బెర్తులో మరో ఇద్దరు ప్రయాణికులు మాత్రమే ప్రయాణించేందుకు అనుమతించేవారు.  స్లీపర్‌ కోచ్‌, మూడో తరగతి ఏసీలో మరో రెండు లోయర్‌ బెర్తుల్లో ఆర్‌ఏసీ ప్రయాణికులు ప్రయాణించేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపింది. ప్రస్తుత నిర్ణయంతో ప్రయాణికులకు అదనంగా ప్రయోజనం దక్కనుంది.