రపు కోయిల్‌ అళ్వార్‌ తిరుమంజనం

తిరుమల : తిరుమల వెంకన్న ఆయలంలో మంగళవారం కోయిల్‌ అళ్వార్‌ తిరుమంజనం జరగనుంది. తిరుమంజనం నేపధ్యంలో శ్రీవారికి అష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి దర్శనాన్ని మధ్యాహ్నం వరకు నిలిపివేశారు. అలాగే రేపు జరగాల్సిన అన్ని ఆర్జిత సేవలను రద్దుచేసింది. వీఐపీ బ్రేక్‌ దర్శనాన్ని రద్దు చేసి, ప్రోటోకాల్‌ వీవీఐపీలకు ప్రత్యేక ప్రవేశ దర్శనానికి టీటీడీ అనుమతి ఇచ్చింది.
ప్రతి ఏటా నాలుగు పర్యాయాలు తిరుమలలో తిరుమంజనం కార్యక్రమన్ని నిర్వహిస్తారు. బ్రహ్మూెత్సవాలు, ఉగాది, ఆనివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి, తదితర పర్వ దినాలకు ముందు వచ్చే మంగళవారం నాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ. కోయిల్‌ అళ్వార్‌ తిరుమంజనం అనగా వివిధ రకాల పరిమళ ద్రవ్యాలతో లేపనం చేసి శుభ్రం చేయడం, ఆలయంలోని శ్రీవారి సన్నిధిలోని గోడలు, సంపంగి ప్రాకార గోడలు, పరివార దేవతల ఆలయాలు, ప్రసాదాలు తయారుచేసే పోటులను శుభ్రం చేస్తారు.