రబీకి నీరు ఇస్తారా లేదా
ఖమ్మం, నవంబర్ 3 : రబీ పంటకు ఎన్‌ఎస్‌పి సాగు జలాలు ఇస్తారా లేదా అని తెలుగు రైతు ఖమ్మం జిల్లా అధ్యక్షుడు సుధాకర్ ప్రశ్నించారు. తక్షణమే స్పష్టం చేయాల్సి ఉందని డిమాండ్ చేశారు. రబీలో ఏ రకమైన ఆరుతడి పంటలు సాగుచేస్తే ఎంతనీరు అవసరం తదితర సమగ్ర సమాచారంతో ఉన్నతాధికారులు విపక్షాలతో చర్చించి తక్షణం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అన్నారు. నీరు అందించే పరిస్థితులు లేకుంటే ఆ విషయాన్ని అయిన స్పష్టం చేయాలని అన్నారు. ఇలాంటి సమాచారంతో ప్రభుత్వం వైఖరిని రైతుల ముందు ఉంచాలని అన్నారు. సాగర్‌పై ప్రభుత్వానికి స్పష్టత లేకనే ఈ పరిస్థితి తలెత్తిందని అన్నారు. నీరు అందివ్వలేమని ప్రకటించి కాల్వ ఆధునికీకరణ పనులు పూర్తి చేసిన రైతులు సంతోషించే వారని ఆయన అన్నారు.