రష్యా`ఉక్రెయిన్ యుద్ధంపై ప్రపంచానికి ఆసక్తి తగ్గిపోయింది
` ఈ యుద్ధం నా జీవితాంతం కొనసాగుతుంది
` ఇది చికిత్సే లేని రోగంలా తయారైంది
` ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ
కీవ్(జనంసాక్షి): రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపట్ల ప్రపంచం నిరాసక్తిని ప్రదర్శిస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇటీవల అంగీకరించారు. ఈ యుద్ధం తన జీవితాంతం కొనసాగు తుందని, అది చికిత్సే లేని రోగంలా తయారైందని ఉక్రెయిన్ వాసులు నిస్పృహతో చెబుతున్నారు. 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన మొదట్లో ఆన్‌లైన్‌లో విరాళాలు వెల్లువెత్తాయి. ఉక్రెయిన్ ఆయుధాలు కొనడానికి ఈ నిధులు ఎంతో అక్కరకొచ్చాయి. యుద్ధం ఎడతెగకుండా సాగడంతో క్రమంగా విరాళాలు తగ్గుతూ వస్తున్నాయి. ఇంతలో ఇజ్రాయెల్, హమాస్ పోరు విరుచుకుపడటంతో ప్రపంచం దృష్టి అటు మళ్లి ఉక్రెయిన్ యుద్దానికి జనం మదిలో ప్రాధాన్యం తగ్గుతూ నిధుల ప్రవా హమూ తగ్గిపోయింది. ఇప్పుడు విదేశాల నుంచి వస్తున్న విరాళాలకన్నా స్వదేశంలో సేకరిస్తున్న నిధులే ఎక్కువయ్యాయి. ఉక్రెయిన్ నుంచి రష్యాను తరిమేస్తామంటూ ఈ ఏడాది జూన్‌లో మొదలుపెట్టిన ఎదురుదాడి నత్తనడకగా సాగుతోంది. ఆక్రమిత స్థలాల నుంచి రష్యన్లను పారదోలడంలో ఉక్రెయిన్ విఫలమైంది. తాము అధికారంలోకి వస్తే ఉక్రెయిన్‌కు సాయానికి స్వస్తి చెబుతామని ప్ర తిపక్ష రిపబ్లికన్లు బాహాటంగానే చెబుతున్నందున అమెరికా సహాయం అనిశ్చితిలో పడిరది. ఇజ్రా యెల్, హమాస్ పోరుపై దృష్టి కేంద్రీకరిస్తున్న అమెరికా తాను ఉక్రెయిన్‌కు అదనపు నిధులను ఇ వ్వలేనని ప్రకటించింది. ఈయూ లోనూ రాజకీయ విభేదాలు తలెత్తడంతో ఉక్రెయిన్‌కు గతంలో హావిూ ఇచ్చిన మేరకు ఆయుధాలను సరఫరా చేయడం లేదు. ఈయూ దృష్టి ఇప్పుడు గాజాపైకి మళ్లింది.