రష్యాతో భారత్ సంబంధాలు వేరు
అలాంటి బంధాలు మాకు లేవన్న అమెరికా
అమెరికా అధ్యక్షుడి అడ్మినిస్టేష్రన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వాషింగ్టన్,ఫిబ్రవరి 26(జనం సాక్షి): భారత్,రష్యా సంబంధాలు భిన్నమైనవని అమెరికా వ్యాక్యానించింది. అలాంటి బంధాలు తమకు రస్యాతో లేవని తెలిపింది. అలాగే రష్యాతో భారత్, అమెరికా దేశాలకు ఉన్న సంబంధాలు విభిన్నమైనవని జో బైడెన్ అడ్మినిస్టేష్రన్ వ్యాఖ్యానించింది. భారత్‌కు రష్యాతో రక్షణ, భద్రత సంబంధాలతో సహా అనేక విధాలుగా సంబంధాలు ఉన్నాయని పేర్కొంది. అటువంటి సంబంధాలు రష్యాతో తమకు లేవని తెలిపింది. నిబంధనల ఆధారిత అంతర్జాతీయ వ్యవస్థను పరిరక్షించేందుకు తమ పలుకుబడిని ఉపయోగించాలని రష్యాతో సంబంధాలున్న ప్రతి దేశాన్ని తాము కోరామని తెలిపింది. అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ విలేకర్లతో మాట్లాడుతూ, తమకు భారతదేశంతో చాలా ముఖ్యమైన ప్రయోజనాలు ఉన్నాయన్నారు. భారత్`అమెరికా అత్యంత ముఖ్యమైన విలువలను పంచుకుంటున్నాయని తెలిపారు. అయితే రష్యాతో భారతదేశానికి సత్సంబంధాలు ఉన్నట్లు తమకు తెలుసునన్నారు. ఆ సంబంధాలు అమెరికా`రష్యా మధ్య ఉన్న సంబంధాల కన్నా భిన్నమైనవని తెలిపారు.
రష్యాతో భారత దేశానికి సంబంధాలున్నాయి, అవి కచ్చితంగా మాకు లేవు. రక్షణ, భద్రత రంగం సహా వివిధ రంగాల్లో భారత్`రష్యా మధ్య సంబంధాలున్నాయి. అవి మాకు లేవు. పలుకుబడిగల దేశాలన్నీ తమ పలుకుబడిని నిర్మాణాత్మక పద్ధతిలో ఉపయోగించాలని అన్ని దేశాలను కోరామని నెడ్ ప్రైస్ చెప్పారు.