రష్యాపై అమెరికా ఆర్థిక ఆంక్షలు ఫలించేనా

సమస్యను అమెరికా మరింత రాజేస్తున్నదా
అమెరికా తీరుపై మండిపడుతన్న రష్యా
మద్దతుగగా నిలిచి చైనా
వాషింగ్టన్‌,ఫిబ్రవరి24(జనం సాక్షి): అమెరికా ఆర్థిక బెదరింపులను రష్యా ఖాతరు చేసేలా లేదు. ఎందుకంటే అఫ్టాన్‌ విషయంలో అమెరికా అనుసరించిన నీతికి ఉక్రెయిన్‌లో తాము అనుసరిస్తున్న తీరుకు తేడా ఉందన్న భావనలో ఉంది. రష్యాకి చెందిన రెండు పెద్ద ఆర్థిక సంస్థల కార్యకలాపాలను పూర్తిగా నిషేధించ నున్నట్లు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ తెలిపారు. రష్యా రుణంపై సమగ్ర ఆంక్షలు వుంటాయన్నారు. పశ్చిమ దేశాల సాయం రష్యా ప్రభుత్వానికి అందకుండా చేస్తామని స్పష్టం చేశారు. రష్యా పశ్చిమ దేశాల నుండి
పెట్టుబడులను సేకరించలేదని, అమెరికా మార్కెట్‌లోనూ,యురోపియన్‌ మార్కెట్లలోనూ కొత్తగా రుణాలను తీసుకోలేదని, వాణిజ్యం చేయలేదని చెప్పారు. వైట్‌హౌస్‌ నుంచి బైడెన్‌ ప్రసంగిస్తూ, అంతర్జాతీయ చట్టాన్ని పుతిన్‌ దారుణంగా అతిక్రమించారని విమర్శించారు. ఇది, ఉక్రెయిన్‌పై రష్యా దాడికి ఆరంభమని వ్యాఖ్యా నించారు. పుతిన్‌ తన చర్యలతో ముందుకు వెళితే తాము కూడా మరిన్ని ఆంక్షలు విధిస్తామని హెచ్చరిం చారు. బాల్టిక్‌ దేశాలకు మరిన్ని అమెరికా బలగాలను పంపుతున్నట్లు చెప్పారు. ఉక్రెయిన్‌ విషయంలో పుతిన్‌ చేసిన ప్రకటనలతో తమలో ఎవరూ మోసపోరని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌పై నెలకొన్న సంక్షో భాన్ని పరిష్కరించడానికి పుతిన్‌ మూడు షరతులు విధించారు. క్రిమియాపై రష్యా సార్వభౌమాధికారాన్ని ఉక్రెయిన్‌ గుర్తించాలి, నాటోలో చేరే ప్రయత్నాన్ని విరమించాలి, పాక్షికంగా నిస్సైనికీకరణ జరగాలని పుతిన్‌ పేర్కొంటున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు వున్నాయా అని ప్రశ్నించగా, క్షేత్రస్థాయిలో మారే పరిణామాలను బట్టి తమ నిర్ణయం ఆధారపడి వుంటుందని, ఇప్పుడే బలగాలు అక్కడకు వెళ్లిపోతు న్నాయని చెప్పలేమని అన్నారు. మరోవైపు అవసరమైతే సైనిక బలగాలను దేశం వెలుపల ఉపయోగించ డానికి అధ్యక్షుడు పుతిన్‌కి రష్యా ఎంపీలు అధికారమిచ్చారు. ఈ మేరకు రష్యా ఎగువసభ అయిన ఫెడరేషన్‌ కౌన్సిల్‌ సభ్యులు ఏకగ్రీవంగా ఓటు వేశారు. దీంతో ఉక్రెయిన్‌లోని రెబెల్‌ ప్రాంతాల్లో రష్యా సైన్యం మోహరించడానికి మార్గం సుగమమైంది. పూర్వపు సోవియట్‌ సామ్రాజ్యాన్ని పునరుద్ధరించాలని రష్యా భావిస్తోందంటూ వచ్చిన ఆరోపణలను పుతిన్‌ తిరస్కరించారు. ఇది వాస్తవం కాదని స్పష్టం చేశారు. కొత్తగా తలెత్తిన భౌగోళిక, రాజకీయ వాస్తవాలను మాస్కో గుర్తిస్తోందని అన్నారు. తీవ్రమైన సంక్షుభిత పరిస్థితుల్లో కూడా తాము ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామన్నారు. ఉక్రెయిన్‌ లోని పలు ప్రాంతాల్లో 30రోజుల పాటు అత్యవసర పరిస్థితి విధించాలని ఉక్రెయిన్‌ జాతీయ భద్రతా, రక్షణ మండలి కోరింది. అవసరమనుకుంటే మార్షల్‌ లా, కర్ఫ్యూ విధించడానికి కూడా అధికారులు సిద్ధంగా వున్నారని, ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలు లేవని చెప్పారు. ఉక్రెయిన్‌ సంక్షోభంలో అమెరికా భయాందో ళనలను సృష్టిస్తోందని, అగ్నికి ఆజ్యం పోసే రీతిలో వ్యవహరిస్తోందని చైనా బుధవారం విమర్శించింది. పెరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు చర్చలే మార్గమని సూచించింది. రష్యాపై ఏకపక్షంగా ఆంక్షలు విధించడాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకించింది.