రష్యా ఎయిర్‌పోర్టులో కలకలం
` ఇజ్రాయెల్ నుంచి వచ్చిన విమానంపైకి దూసుకెళ్లిజన నిరసనకారు
` ఇజ్రాయిలీల కోసం వెతుకులాట.. ఆదేశానికి వ్యతిరేకంగా నినాదాలు
మాస్కో (జనంసాక్షి): ఇజ్రాయెల్ నుంచి వచ్చిన విమానం రష్యా ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యింది. ఆ వెంటనే వందలాది మంది నిరసనకారులు ఆ ఎయిర్‌పోర్ట్‌లోకి చొరబడ్డారు. ఇజ్రాయెల్ విమానం వద్దకు చేరుకున్నారు. ఇజ్రాయిలీలు, యూదుల కోసం వెతికారు. ఆ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న రష్యాలోని మఖచ్‌కలలో ఈ సంఘటన జరిగింది. గాజాపై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో పాలస్తీనా మద్దతుదారులు ఆదివారం పెద్ద సంఖ్యలో డాగేస్థాన్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నుంచి వచ్చిన విమానం ల్యాండ్ కాగానే ఎయిర్‌పోర్ట్ గోడలు దూకి లోనికి ప్రవేశించారు. ఇజ్రాయిలీలు, యూదుల కోసం అంతటా వెతికారు. చివరకు ఇజ్రాయెల్ నుంచి వచ్చిన విమానం వద్దకు నిరసనకారులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఆ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాలస్తీనా జెండాలతోపాటు ఫ్లకార్డులను చేతపట్టారు. పిల్లలను చంపే హంతకులు ఇజ్రాయిలీలని ఆరోపించారు. ఊహించని ఈ పరిణామాలతో ఆ ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం నెలకొన్నది.కాగా, అప్రమత్తమైన పైలెట్లు విమానం డోర్ తెరువ వద్దని ప్రయాణికులను హెచ్చరించారు. అలాగే అంతా విమానంలోనే ఉండాలని ఎనౌన్స్ చేశారు. ఇంతలో రష్యా భద్రతా సిబ్బంది పెద్ద సంఖ్యలో ఆ ఎయిర్‌పోర్ట్ వద్దకు చేరుకున్నారు. సుమారు 60 మంది నిరసనకారులను అరెస్ట్ చేశారు. ఆ విమానాశ్రయాన్ని మూసివేశారు. అక్కడ దిగాల్సిన విమానాలను ఇతర ఎయిర్‌పోర్ట్‌లకు మళ్లించారు.మరోవైపు ఆ ఎయిర్‌పోర్ట్‌లో ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలోనే ఉందని రష్యా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. బయట శక్తుల ప్రమేయం వల్ల ఈ సంఘటన జరిగినట్లు ఆరోపించింది. ఈ సంఘటన నేపథ్యంలో నవంబర్ 6 వరకు ఆ విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు వెల్లడిరచారు. కాగా, పాలస్తీనా మద్దతుదారులు పెద్ద సంఖ్యలో ఎయిర్‌పోర్ట్‌లోకి చొచ్చుకురావడం, ఇజ్రాయిలీలు, యూదుల కోసం అంతటా వెతకడం, ఎయిర్‌పోర్ట్ నుంచి వెళ్లే వాహనాలు, హోటల్స్‌ను తనిఖీ చేసిన వీడియో క్లిప్‌లు సోషల్ విూడియాలో వైరల్ అయ్యాయి.