రష్యా దాడులతో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి
వరుసగా ఏడోరోజూ కొనసాగిన దాడులు
వెనక్కి తగ్గేదిలే.. అంటున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు
ఇయు దేశాలు అండగానిలవాలని విజ్ఞప్తి
తన కుంటాన్ని బంకర్లకు పంపిన రష్యా అధ్యక్షుడు
కీవ్,మార్చి2(జనం సాక్షి): వరుసగా ఏడోరోజు కూడా రష్యా`ఉక్రెయిన్ మధ్య భీకర దాడులు కొనసాగుతు న్నాయి. రష్యా ఉక్రెయిన్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఏడో రోజు కూడా రష్యా.. పొరుగు
దేశం ఉక్రెయిన్‌పై తన దాడులను తీవ్రతరం చేసింది. చర్చలు ఫలించక పోవడంతో ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాలలో ఒకటైన రష్యా.. పొరుగు దేశం ఉక్రెయిన్‌పై తన దాడులను తీవ్రతరం చేసింది. మొదటి విడత చర్చలు ముగిసిన తర్వాత కీవ్ నగరంపై రష్యా క్షిపణుల వర్షం కురిపిస్తోంది. దాడులు తీవ్రతరం చేస్తున్న నేపథ్యంలో.. ఉక్రెయిన్ నుంచి ప్రమాదం పొంచి ఉన్న దృష్యా రష్యా అధ్యక్షడు పుతిన్ సైతం తమ కుటుంబాన్ని ఐలాండ్ లోని బంకర్‌కు తరలించారు. అయితే.. రష్యా`ఉక్రెయిన్ మధ్య రెండోసారి చర్చలు జరగనున్నాయి. మొదటి విడత చర్చలు విఫలం అయిన నేపథ్యంలో రెండో దశ జరిగే చర్చలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పశ్చిమ దేశాలన్నీ చర్చలు సఫలం కావాలంటూ కోరుతున్నాయి. రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ సంచలన ప్రతిజ్ఞ చేశారు. ప్రాణాలు పోయినా సరే రష్యాకు లొంగేది లేదని స్పష్టం చేశారు. రష్యాకు తగిన గుణపాఠం నేర్పిస్తామంటూ పేర్కొన్నారు. రష్యా దాడులతో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. కీవ్‌పై పట్టు కోసం రష్యా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రష్యన్ బలగాలు కీవ్‌ను చుట్టుముడుతున్నాయి. సుమారు 64 కిలోవిూటర్ల పొడవైన యుద్ధ ట్యాంకుల కాన్వాయ్ కీవ్‌లోకి ఎంటరైంది. కీవ్‌ను చుట్టుముట్టిన రష్యన్ బలగాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. మిస్సైల్స్, ఫిరంగులతో ఎటాక్స్ చేస్తున్నారు. తాజాగా 56 రాకెట్లు, 113 క్షిపణులను రష్యా ప్రయోగించింది. మునుపెన్నడూ లేని విధంగా ఈ సమయంలో పుతిన్ ప్రపంచం నుంచి చాలా ఒంటరిగా మారారని అమెరికా ప్రెసిడెంట్ బిడెన్ అన్నారు. యూరోపియన్ యూనియన్‌లోని దాదాపు 30 దేశాలు ప్రస్తుతం ఉక్రెయిన్‌తో ఉన్నాయని స్పష్టం చేశారు. యూరోపియన్ యూనియన్‌లో చేరతామంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ దరఖాస్తు చేసిన ఒకరోజులోనే యూరోపియన్ యూనియన్ అత్యవసర పార్లమెంట్ సమావేశం నిర్వహించి సభ్యత్వం ఇచ్చింది. ఈ సందర్భంగా మాట్లాడిన జెలెన్‌స్కీ ప్రపంచ దేశాలన్నీ ఉక్రెయిన్‌కు అండగా నిలవాలని కోరారు. రష్యా దాడుల్లో అమాయక పౌరులు, చిన్నారులు చనిపోతు న్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈయూ సైతం రష్యా విూడియాపై నిషేధం విధించింది. దీంతోపాటు ఈ యుధ్దంపై అంతర్జాతీయ న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. 7, 8 వ తేదీలల్లో విచారణ చేయనుంది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సైతం ప్రత్యేక సమావేశం నిర్వహించి యుద్దాన్ని ఆపడానికి అన్ని చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ విషయంలో సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ పేర్కొంది. ఇదిలాఉంటే.. ఉక్రెయిన్‌పై దాడి చేస్తున్న రష్యాను ఇరుకున పెట్టేందుకు అమెరికా, దాని మిత్రదేశాలు మరిన్ని ఆంక్షలను విధిస్తున్నాయి. రష్యాకు చెందిన మరో 26 మందిపై ఐరోపా సమాఖ్య ఆంక్షలు విధించింది. వారిలో ఒలిగార్క్‌లు, సీనియర్ అధికారులు, పలు బీమా సంస్థలు ఉన్నాయి. మొత్తం ఇప్పటి వరకూ 680 మంది లక్ష్యంగా ఐరోపా సమాఖ్య ఆంక్షలను విధించింది. ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో రష్యాపై తమ ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక ఆంక్షలు విధించబోదని మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ స్పష్టంచేశారు. విదేశీ వ్యవహారాల్లో జోక్యం చేసుకో మని పేర్కొన్నారు. అమెరికా గగనతలం నుంచి రష్యా విమానాల రాకపోకలపై నిషేధం విధించేందుకు అమెరికా ప్రభుత్వం ఆలోచిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. ఐరోపా సమాఖ్య, కెనడా దేశాలు తమ గగనతలంపై నుంచి రష్యా విమానాలు రాకపోకలు సాగించకుండా నిషేధించిన తర్వాత యూఎస్ ఈ దిశగా యోచిస్తోంది. ªపద్ధంలో పాల్గొనే ఆలోచన లేదని నాటో చీఫ్ స్పష్టంచేశారు. ఉక్రెయిన్ పై రష్యా దాడుల నేపథ్యంలో ఈ ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎయిర్ బేస్‌ను లక్ష్యంగా చేసుకుని రష్యా క్రూయిజ్ క్షిపణి దాడి చేయడంతో ఉక్రెయిన్ నగరమైన జైటోమిర్‌లో నలుగురు వ్యక్తులు మరణించారని
ఉక్రెయిన్ అంతర్గత మంత్రి సలహాదారు అంటోన్ గెరాష్చెంకో తన టెలిగ్రామ్ ఛానెల్‌లో తెలిపారు. క్షిపణి ఇళ్లపై పడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. మరోవైపు క్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు పక్రియను కేంద్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. భారతీయులతో మరో రెండు విమానాలు ఢల్లీికి చేరుకున్నాయి. వారిని కేంద్ర మంత్రులు స్వాగతం పలికారు.