రష్యా యుద్ద ప్రకటనతో మార్కెట్లపై తీవ్ర ప్రభావం
వంద డాలర్లు దాటిన క్రూడాయిల్ బ్యారెల్ ధర
న్యూఢల్లీి,ఫిబ్రవరి24(జనం సాక్షి): ఉక్రెయిన్‌పై మిలటరీ ఆపరేషన్ చేపడుతున్నట్లు పుతిన్ ప్రకటన అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర గురువారం 100 డాలర్లను దాటింది. సుమారు ఏడేళ్ల అనంతరం అత్యధిక ధర నమోదవడం గమనార్హం. 2014వ సంవత్సరం తర్వాత తొలిసారిగా చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లకు చేరాయి. 2014వ సంవత్సరంలో ముడిచమురు బ్యారెల్ ధర 100 డాలర్లను అధిగమించింది. ఇంధనంతోపాటు గోధుమలు, లోహాల ధరలు పెరగనున్నట్లు సమాచారం. ఇటీవల కరోనా లాక్ డౌన్‌ల అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. రష్యా ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు. ఇది ప్రధానంగా యూరోపియన్ ర్గిªనైరీలకు ముడి చమురును విక్రయిస్తుంది. మార్కెట్ ఇన్వెస్టర్లు వేగంగా సురక్షితమైన పెట్టుబడుల వైపు మళ్లుతున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అందుకే బంగారం, డాలర్లు, జపాన్ యెన్ వంటి వాటి ధరలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆసియా స్టాక్ మార్కెట్లు 2 నుండి 3 శాతం నష్టపోయాయి. సెన్సెక్స్ 1432.50 పాయింట్లు నష్టపోగా, నిప్టీ 410.70 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్ ఉదయం 9 గంటల సమయంలో 1432.50 పాయింట్లు లేదా 2.50 క్షీణించి 55,795 వద్ద ట్రేడవుతోంది. అలాగే నిప్టీ 410.70 పాయింట్లు లేదా 2.41 శాతం క్షీణించి 166652.60 వద్ద ట్రేడవుతోంది.