రసాభాసగా సర్వసభ్య సమావేశం

  • ఆళ్లపల్లి ఆగస్టు 29 (జనం సాక్షి)

    రసాభాసగా సర్వసభ్య సమావేశం సోమవారం జరిగింది .ఈ సమావేశం ఎంపీపీ మంజు భార్గవి అధ్యక్షతన నిర్వహించారు .22 శాఖలకు గాను 12 శాఖలు హాజరయ్యాయి. దీంతో ఆ శాఖలపై ఎంపీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు పలు సమస్యలపై అధికార తీరును సర్పంచులు ఎంపీపీ మంజు భార్గవి దృష్టికి తీసుకెళ్లారు. అనిశెట్టిపల్లి వద్ద పుణ్యపువాగు ,దయ్యాలొది హై లెవెల్ వంతెన ,ఇల్లందు నుంచి ఆళ్లపల్లికి బస్సు సౌకర్యం కావాలని తీర్మానం చేశారు .అదేవిధంగా  కొత్తగూడెం నుండి మర్కోడు బస్ సమయపాలన మార్చాలని అన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ మంజు భార్గవి, జడ్పిటిసి కొమరం హనుమంతు మాట్లాడుతూ… మండలంలోని అధికారులు అభివృద్ధికి తోడ్పడాలని సమయపాలన పాటించాలని అన్నారు .సర్పంచులు అడిగిన సమస్యలపై ఆయా శాఖ అధికారులు దృష్టి సారించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రేస్ ఎల్లయ్య ,ఎంపీడీవో మంగమ్మ, తహసిల్దార్ సాదయా సుల్తాన్ ,ఎంపీటీసీ సత్యవతి కో ఆప్షన్ సభ్యులు రహీం సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.