రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి

– ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికార కోసం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు
– ప్రజా సంక్షేమమే టిఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం
– ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
హుజూర్ నగర్ సెప్టెంబర్ (జనం సాక్షి): రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ లు అన్నారు. ఆదివారం హుజూర్ నగర్ పట్టణంలోని టిఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ హుజూర్‌ నగర్ అభివృద్ధిని చూసి తట్టుకోలేని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్దాలను ప్రచారం చేస్తున్నాడని ఆరోపించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు చేయలేని అభివృద్ధిని తాను టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా రెండున్నర సంవత్సరాల్లోనే అభివృద్ధి చేశానని అది చూసి ఓర్వలేక అసత్యాలను ప్రచారం చేస్తూ నియోజకవర్గంలో పబ్బం గడుపుతున్నారని అన్నారు.
ఆయన మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అవినీతి మొత్తం కూడా హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలకు తెలుసునని అన్నారు.
ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పైన అన్నిటిని కూడా ప్రజల్లో అపోహలు సృష్టించేలా వ్యవహరిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డినీ ఎప్పుడు ఎవరు నమ్మరన్నారు. ఓట్ల కోసం కోట్ల రూపాయలను కారులో బూడిద చేసుకున్న ఘనత నీది అన్నారు. పదవుల కోసం కాదు అభివృద్ధి కోసం పాటుపడాలన్నారు. 20 ఏళ్ల రాజకీయ జీవితంలో నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేశావో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారన్నారు.
కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య మాట్లాడుతూ రెండు నియోజకవర్గాల్లో ఆయన చేసిన అవినీతి ప్రజలకు అందరికీ తెలుసు అన్నారు. రాజకీయ విమర్శలు సహజమే కానీ అవి శృతిమించేలా వ్యక్తిగత విమర్శలు కూడా చెయ్యడం సమంజసం కాదు అన్నారు. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పనిగట్టుకుని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలపై తిరిగి అసత్య ప్రచారాలు చేస్తున్న ఎవరు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు అమ్ముకున్న చరిత్ర నీది అన్నారు. పార్టీని అడ్డం పెట్టుకొని పదవులు ఎక్కి కోట్లు సంపాదించావునని ఆరోపించారు. పార్టీలో ఇమడలేక అసత్య ఆరోపణలు చేస్తున్నావన్నారు. స్కీం, ఇతర కార్యక్రమాలకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నావని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చిట్యాల అమర్నాథ్ రెడ్డి, ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, టిఆర్ఎస్ నాయకులు అట్లూరి హరిబాబు, కుంట సైదులు, సోమగాని ప్రదీప్, కిరణ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.