రాజకీయ కారణాలతో అఫ్జల్‌గురును ఉరి తీయలేదు:షిండే

1

ముంబయి మే 24(జనంసాక్షి):

పార్లమెంటుపై దాడికి పాల్పడిన ఉగ్రవాది అఫ్జల్‌గురుని ఉరితీసింది

రాజకీయ ప్రయో జనాలకోసం కాదు అని కేంద్ర మాజీ ¬ం మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే అన్నారు. కోర్టు తీర్పులకనుగుణం గానే తాము నడుచుకున్నామని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసమే యూపీఏ ప్రభుత్వం అఫ్జల్‌ గురుని ఉరితీశారని నేషనల్‌ కాన్ప Ûరెన్స్‌ లీడర్‌ ఒమర్‌ అబ్దుల్లా చేసిన ఆరోపణలు ఆయన ఖండించా రు.’సుప్రీంకోర్టు తుది నిర్ణయాన్ని ప్రకటించింది. అత్యున్నత న్యాయ స్థానంలో అఫ్జల్‌ కేసుపై అతడికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. క్షమా భిక్ష కూడా తిరస్కరించబడింది. ఇ వన్నీ జరిగిన తర్వాత చివరిగా ఉరితీసేందుకు నిర్ణయం తీసుకో వడం

జరిగింది. అది రాజకీయ నిర్ణయం కాదు’ అని ఆయన వివరణ ఇచ్చారు. కాశ్మీర్‌లో

రాజకీయాలను పెడద్రోవ పట్టించాలని ఒమర్‌ ఇలాంటి వ్యాఖ్యలకు దిగుతుండొచ్చని షిండే చెప్పారు. ఉరి

తీసే సమయంలో ఇలాంటి ఆరోపణలేవి ఆయన ఎందుకు తమ దృష్టికి తీసుకురాలేదని ఆయన ప్రశ్నించారు.