రాజకీయ లబ్ధి కోసమే ప్రధాని మోడీ పర్యట

నడుస్తున్న ఎఫ్.సి.ఐకి ప్రారంభోత్సవాలు చేయడం సిగ్గు చేటు.
విభజన హామీలు అమలు చేయండి.
మత దివ్వేశాలు రెచ్చగొట్టేందుకే బిజెపి నేతల పర్యటనల పేరా కుట్రలు.
మోడీ పర్యటన వెంటనే రద్దు చేసుకొవాలి.
అఖిల పక్ష కాంగ్రెస్, సిపిఐ,టిఆర్ఎస్, టిడిపి నేతల డిమాండ్.
12న హుస్నాబాద్ లో జరిగే అఖిల పక్షం ఆధ్వర్యంలో ప్రజా ఆందోళనను విజయ వంతం చేయండి.
హుస్నాబాద్ నవంబర్ 11(జనంసాక్షి)కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో కులమత కలహాలు పేరిగిపోయి ప్రజలు అనేక విధాలుగా ఇబ్బందులకు గురవుతున్నారని అఖిల పక్ష సమావేశం హాజరైన కాంగ్రెస్, సిపిఐ,టిఆర్ఎస్,టిడిపి పార్టీల నేతలు అన్నారు.శుక్రవారం హుస్నాబాద్ పట్టణంలోని అనభేరి, సింగిరెడ్డి అమరుల భవన్ లో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్ అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశంలో పాల్గొన్న టిఆర్ఎస్, సిపిఐ,కాంగ్రెస్,టిడిపి నాయకులు మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నారని తెలంగాణ విభజన హామీలు అమలు చేయకుండా చాలా కాలంగా నడుస్తున్న ఎఫ్.సి.ఐని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మల్లి ఎలా ఎందుకు ప్రారంభోత్సవం పరిశీల ఎందుకోరకని అఖిల పక్ష నాయకులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో కులమత ద్వేషాలు పేరిగిపోయి దళిత, మైనారిటీ,పేద ప్రజలు అనేక విధాలుగా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.పెద్ద నొట్లరద్దుతో పేద మధ్యతరగతి ప్రజలకు చాలా అన్యాయం జరిగిందని,ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చేస్తు పెట్టుబడి దారులకు వంత పాడుతు,డిజిల్, పెట్రోల్,వంట గ్యాస్,జిఎస్టి పేరతో ప్రజలపై ఆర్థిక భారం వేసి నలింపు చేస్తున్న నరేంద్ర మోడీ పర్యటన రద్దు చేసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు.లేకుంటే తెలంగాణ ప్రజల ఆగ్రహానికి నరేంద్ర మోడీ,బిజెపి నేతలు గురి తప్పదని అఖిల పక్ష నేతలు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ డిసిసి అధికార ప్రతినిధి కేడం లింగమూర్తి,మండల అధ్యక్షులు బంక చెందు,టిఆర్ఎస్ మండల అధ్యక్షులు వంగ వెంకట్రారెడ్డి,పట్టణ అధ్యక్షులు అన్వర్, టిడిపి జిల్లా నాయకులు బత్తుల శ్రీనివాస్,పట్టణ అధ్యక్షులు వరియోగుల శ్రీనివాస్, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు అయిలేని సంజివరెడ్డి ఏగ్గొజు సుదర్శన్ చారి,మండల నాయకులు అయిలేని మల్లారెడ్డి,పొదిల కుమారస్వామి, ఎఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి చింతకింది కుమార్, జొన్నలగడ్డల కుమార్, తదితరులు పాల్గొన్నారు.