రాజధాని తీర్పుపై సుప్రీంకు వెళతాం

మూడు రాజధానులపై తగ్గేది లేదన్న సుచరిత
గుంటూరు,మార్చి4(జనం సాక్షి): ఓ వైపు హైకోర్టు స్పష్టమైన తీర్పును ఇచ్చినా మంత్రులు మాత్రం మూడు రాజధానుల పాటను ఆపేయడం లేదు. మూడురాజధానులకు కట్టుబడి ఉన్నామనిమంత్రి బొత్స వెంటనే ప్రకటించగా తాజాగా … దానికే కట్టుబడి ఉన్నామని హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ తమ విధానమని… అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నారు. రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు తెలిపారు. రాజధాని ఎక్కడుండాలన్న అంశం రాష్ట్ర పరిధిలోనిదేనని కేంద్రం చెప్పిందని గుర్తుచేశారు. రాజధానిపై శాసన నిర్ణయాధికారం లేదని కోర్టు చెప్పినట్లు తెలిపారు. అమరావతి ప్రాంతం శాసన రాజధానిగా ఉంటుందన్నారు. మొత్తం తరలిస్తున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని… రాజధానిపై ప్రభుత్వానికి స్పష్టత ఉందని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు.