రాజన్న జాతర షురూ.. పోటెత్తిన భక్తులు
వేములవాడ: కరీంనగర్ జిల్లా వేములవాడలో కొలువుదీరిన రాజన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ రోజు నుంచి శివరాత్రి జాతర ప్రారంభం అయినట్లు ఆలయ అధికారులు తెలిపారు. రద్దీ దృష్ట్యా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.