రాజయ్య కేసుపై పొంగులేటి, కుక్కకంటే హీనంగా: సోనియాకు సారిక ఏం రాసింది?

7c52uudnవరంగల్/న్యూఢిల్లీ: రాజయ్య కేసుతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి శుక్రవారం నాడు అన్నారు. ఆయన న్యూఢిల్లీలో పార్టీ సీనియర్ నేత ఏకే ఆంటోనీని కలిశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఎన్డీయే ప్రభుత్వం నెహ్రూ, గాంధీయిజంను అంతం చేయాలని కుట్ర చేస్తోందని పొంగులేటి మండిపడ్డారు. మోడీయిజం దేశ భద్రతకు ప్రమాదమని హెచ్చరించారు. అదే సమయంలో రాజయ్య ఇంట్లో జరిగిన ప్రమాదంపై స్పందించారు. దాంతో తమ పార్టీకి సంబంధం లేదన్నారు.

సోనియా గాంధీకి సారిక లేఖ రాజయ్య తనను వేధించారని, ఆయనకు వరంగల్ ఉప ఎన్నిక టిక్కెట్ ఇవ్వవద్దని ఆయన కోడలు సారిక ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆమె ఈ మెయిల్ ద్వారా దానిని పంపించారని తెలుస్తోంది. తనను ఆదరించలేదని సోనియాకు రాసిన లేఖలో సారిక పేర్కొన్నారని తెలిస్తోంది. తన భర్త అనిల్, అత్త మాధవి తనను, పిల్లలను ఎలా నిర్లక్ష్యం చేశారో సోనియాకు వివరించారు. తనను కుక్క కంటే దారుణంగా చూశారని, రాజయ్య, ఆయన భార్య మాధవి, కొడుకు అనిల్‌లు తనను, తన పిల్లలను చంపేందుకు కుట్ర చేశారని కూడా పేర్కొన్నారని తెలుస్తోంది. తనను మానసికంగా, భౌతికంగా వేధించారని, తాను గర్భవతిగా ఉన్నప్పుడు ఇంట్లోని టాయిలెట్‌ను ఉపయోగించేందుకు అనుమతించలేదని, తనను ఇంటిలోని పడక గదిలో నిద్రించేందుకు అనుమతించలేదని, తనను బలవంతంగా హాలులోనే ఉంచేవారని పేర్కొందని తెలుస్తోంది. కస్టడీకి ఇవ్వాలని పోలీసుల పిటిషన్ రాజయ్య కుటుంబాన్ని తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఇది రేపు విచారణకు రానుంది. కోడలు సారిక, ముగ్గురు మనవళ్ల అనుమానాస్పద మృతి కేసులో రాజయ్య జైలులో ఉన్న విషయం తెలిసిందే.