రాజస్థాన్‌లో దారుణ ఘటన

భార్యను నగ్నంగా ఊరేగించిన భర్త
ముగ్గిరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
జైపూర్‌,సెప్టెంబర్‌2 జనం సాక్షి     రాజస్థాన్‌లో ఘాతుకం జరిగింది. సొంత భర్తే భార్యను నగగ్నంగా ఊరేగించాడు. ఓ గిరిజన మహిళ (21)ను తన భర్తే విపరీతంగా కొట్టి, ఆమెను వివస్త్రను చేసి ఊరిలో ఊరేగించాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌ జిల్లాలో గురువారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఆమె భర్త.. ఆమెను ఇంటి బయటే విపరీతంగా కొట్టాడు. ఆ సమయంలో ఆమె సహాయం కోసం అరిచినప్పటికీ అతను పట్టించుకోకుండా ఆమెను అందరి ముందు వివస్త్రను చేసి ఊరేగించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌విూడియాలో వైరల్‌ అయింది. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని, మరికొందరిని అరెస్టు చేసే అవకాశం ఉందని శనివారం పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై రాజస్థాన్‌ డిజిపి ఉమేష్‌ మిశ్రా మాట్లాడుతూ.. ’పెళ్లయినా ఆమె భర్తతో కాకుండా.. మరో వ్యక్తితో సహజీవనం చేస్తున్నందుకు అత్తమామలు, భర్త ఆగ్రహానికి గురయ్యారు. ఆమెను భర్తే కిడ్నాప్‌ చేసి తమ ఊరికి తీసుకెళ్లి.. ఆమెను కొట్టి.. అందరిముందు వివస్త్రను చేసి ఊరిలో ఊరిగేంచారు. వివాహేతర సంబంధం కారణంతోనే ఆమెపై భర్తే దాడికి పాల్పడ్డాడు.’ అని ఆయన అన్నారు. నిందితులను అరెస్టు చేసేందుకు ఆరు బృందాలను ఏర్పాటు చేశామని ప్రతాప్‌గఢ్‌ ఎస్పీ అమిత్‌ కుమార్‌ తెలిపారు. రాజస్థాన్‌లో జరిగిన ఈ ఘటనను ఆ రాష్ట్ర సిఎం అశోక్‌గెహ్లాట్‌ ఖండిరచారు. మహిళపై దాడికి పాల్పడిన అత్తమామలు, భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని గెహ్లాట్‌ పోలీసులను ఆదేశించారు. వీలైనంత త్వరగా వారిని కటకటాల్లోకి నెట్టి విచారణ చేపట్టాలి. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ద్వారా విచారణ చేపట్టి వారికి త్వరగా శిక్షను విధించాలి. ఇలాంటి నేరగాళ్లు సమాజంలో చోటు ఉండకూడదు అని గెహ్లాట్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా ఈ ఘటనపై గెహ్లాట్‌ ప్రభుత్వాన్ని విమర్శించారు. రాజస్థాన్‌లోని అధికార పార్టీ ఫ్యాక్షన్‌ గొడవల్ని పరిష్కరించుకోవడంలో నిమగమై ఉంది. రాష్ట్రంలో మహిళల భద్రతల్ని గెహ్లాట్‌ ప్రభుత్వం విస్మరించింది. ఈసారి ఎన్నికల్లో గెహ్లాట్‌కి ఓటమి తప్పదని నడ్డా వ్యాఖ్యానించారు.